‘ పోక్సో’ నిందితుడే చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

‘ పోక్సో’ నిందితుడే చైర్మన్‌

Sep 30 2026 1:46 AM | Updated on Sep 30 2026 1:46 AM

అతడిపై నేటికీ కొనసాగుతున్న 20కి పైగా కేసులు ఒకానొక సమయంలో అతడిపై జిల్లా బహిష్కరణ అదే స్కూలులో విద్యార్థినిపై గతంలో అసభ్య ప్రవర్తనతో కేసు అనంతరం పలు కేసుల నేపథ్యంలో రౌడీషీటు ఓపెన్‌ చేసిన పోలీసులు టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థినులకు రక్షణ కరువు ఆవేదన వ్యక్తం చేస్తున్న బాలికల తల్లిదండ్రులు

గుంటూరు రూరల్‌: టీడీపీ అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో విద్యార్థినులకు రక్షణ లేని దుస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా రూరల్‌ మండలం జొన్నలగడ్డ గ్రామంలో పోక్సో కేసు నిందితుడే ఏకంగా సూ్‌క్‌ల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ) చైర్మన్‌గా ఎన్నిక కావడం గమనార్హం. స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వ్యక్తి స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కమిటీ చైర్మన్‌గా ఎన్నికవటంపై నిరసన వ్యక్తం అవుతోంది. అదే పాఠశాలలో 2025లో 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో అతనిపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో జైలుకు వెళ్లిన నిందితుడు మధు.. ఇప్పుడు ప్రజాప్రతినిధుల అండతో, పాఠశాల ప్రధానోపాధ్యాయుల సహకారంతో కేవలం 40 మంది తమకు అనుకూలమైన విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల కమిటీ చైర్మన్‌గా ఎన్నికవ్వటం విద్యార్థినుల తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతోంది. గ్రామ బహిష్కరణకు గురైన వ్యక్తిని అదే పాఠశాలలో చైర్మన్‌గా ఎన్నుకుంటే విద్యార్థినులకు రక్షణ ఎలా ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతనిపై రౌడీషీట్‌ కూడా ఉన్నట్లు సమాచారం. నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు చెందిన పలువురు సీఐలు నిత్యం ఇతనిపై అబ్జర్వేషన్‌ ఉంచారని, గ్రామానికి రాకుండా అతడి అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకుంటూ వస్తున్నారని స్థానిక ప్రజలు తెలిపారు. అతనిపై మొత్తం 26 కేసులు నమోదు కాగా.. వాటిలో ఇటీవల 6 కేసులను కొట్టివేసినట్లు పేర్కొన్నారు. మిగతా కేసులు విచారణలో, కోర్టు వాయిదాల్లో ఉన్నాయని సమాచారం. గత వారంలో పోక్సో కేసు వాయిదాకు కూడా హాజరు కాలేదని తెలిసింది.

అడ్డదారిలో ఎన్నిక నిర్వహణ

పోలీసులు ఉన్నా పట్టించుకోకపోవటంతో ఎన్నికల వేళ రౌడీయిజంతో, కూటమి నేతల సహకారంతో పాఠశాలలోకి ఎవ్వరినీ రాకుండా చేసి చైర్మన్‌గా నెగ్గాడని ఆరోపిస్తున్నారు. పాఠశాలలో 111 మందికిపైగా విద్యార్థులు ఉండగా... మంగళవారం 40 మంది మాత్రమే ఎస్‌ఎంసీ ఎన్నిక ప్రక్రియకు హాజరయ్యారని సమాచారం. అనుకూలురైన వారిని మాత్రమే లోపలకు రానిచ్చి, మిగతావారిని రాకుండా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల సహకారంతో అతడు చైర్మన్‌గా ఎన్నికై నట్లు ప్రకటించారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు బురదగుంట రాహుల్‌బాబు తదితరులు పాఠశాల ఆవరణ ముందు నిరసనకు దిగారు. సంఖ్యాబలం లేకపోయినా ఎన్నిక ఏకగ్రీవం చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అదేమని ప్రశ్నించిన సంకూరి కిషోర్‌ అనే పేరెంట్‌ను పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లి బెదిరించారని ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో విద్యార్థినులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారినే చైర్మన్‌గా చేస్తే ఇక వారికి రక్షణ ఎలా ఉంటుందని స్థానికులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement