అక్టోబర్‌ ఒకటి మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ ఒకటి మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ

Sep 28 2026 7:45 AM | Updated on Sep 28 2026 7:45 AM

అక్టోబర్‌ ఒకటి మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ కార్తికేయుని ఆలయంలో భక్తజన సందోహం మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం భక్తజనంతో కోలాహలంగా మారింది. ఆదివారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్ల శాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సూపరింటెండెంట్‌ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ డీసీ మాట్లాడుతూ వివిధ సేవా టికెట్ల ద్వారా మొత్తం రూ. 6 లక్షల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. సాగర్‌ నీటిమట్టం

జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: జిల్లాలో అక్టోబర్‌ నెలకు సంబంధించిన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ ఒకటో తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా 1వ తేదీ ఉదయం బ్యాంకుల నుంచి నగదు తీసి (విత్‌ డ్రా), అదే రోజు మధ్యాహ్నం నుంచి పంపిణీ చేస్తారన్నారు. 1వ తేదీన పింఛన్‌ తీసుకోలేని వారికి అక్టోబర్‌ 3వ తేదీన అందజేస్తారని చెప్పారు. ఎస్‌.జీ.ఎస్‌.డబ్ల్యూ, ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లను పంపిణీ చేస్తారని తెలిపారు. ఫించనుదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, అర్హులందరికీ అందజేస్తామని భరోసా ఇచ్చారు. బ్యాంకుల నుంచి నగదు పొందడం, సిబ్బందిని మ్యాపింగ్‌ చేయడం, పంపిణీ సక్రమంగా, సాఫీగా జరిగేందుకు సరైన పర్యవేక్షణ, కార్యాచరణ తయారు చేసి సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 535.70 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి 30,955 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement