గుంటూరు వెస్ట్: మెనూ ప్రకారం వసతి గృహాలు, అంగన్‌వాడీ, పాఠశాల విద్యార్థులకు ఆహారం అందాలని జిల్లా కలెక్టర్ ిసీఎం సాయికాంత్ వర్మ సిబ్బందిని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాలులో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ లేదని స్పష్టం చేశారు. గుడ్లు నాణ్యమైనవిగా ఉండాలని, పాడైన గుడ్లు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి సమాచారం అందించాలన్నారు. అన్న క్యాంటీన్‌లలో సైతం ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. పురపాలక సంఘాల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ, పూడికలు తీయడంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులకు రూపొందించిన యాప్‌లలో సమాచారాన్ని పొందుపరచాలని కలెక్టర్ వివరించారు. సమావేశంలో డీఆర్వో ఎన్.ఎస్.కె. ఖాజావలి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు, ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా, సీపీఓ పి.శేషశ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె.విజయలక్ష్మి పాల్గొన్నారు.
పింఛనుకు
56,867 దరఖాస్తులు
నెహ్రూనగర్: జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల నుంచి మొత్తం 56,867 దరఖాస్తులు అందాయి. ఇందులో ఇప్పటివరకు 9,305 అర్జీలను అధికారులు పరిశీలించి ఆమోదించారు. అర్హత ప్రమాణాలు లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో 632 దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకా 46,930 దరఖాస్తులు పరిశీలన దశలో పెండింగ్‌లోనే ఉన్నాయి.
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ


