సమస్యలకు సకాలంలో పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సమస్యలకు సకాలంలో పరిష్కారం

Sep 19 2026 5:50 AM | Updated on Sep 19 2026 5:50 AM

జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

నగరంపాలెం: జిల్లాలోని పోలీస్‌ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. శుక్రవారం నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీస్‌ సిబ్బంది గ్రీవెన్స్‌ డే నిర్వహించారు. జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లల్లో విధులు నిర్వర్తించే పోలీస్‌ సిబ్బంది నుంచి వ్యక్తిగత సమస్యలు, బదిలీలు, పదోన్నతులు, సెలవులు, వైద్య అవసరాలు పరిపాలనా అంశాలకు సంబంధించి వినతులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. ప్రతి వినతిని జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు. శాఖ నిబంధనలకు అనుగుణంగా వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తాన్నామని అన్నారు. బదిలీలు, ఉద్యోగోన్నతులు, పరిపాలనా నిర్ణయాలతోపాటు ఇతరత్రా వాటిని పారదర్శకంగా చేపడతామని స్పష్టం చేశారు. ప్రతి పోలీస్‌ విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావంతో వ్యవహరించాలని అన్నారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా మెలుగుతూ పోలీస్‌ శాఖపై ప్రజల్లో విశ్వాసం, భద్రతాభావం పెంపొందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement