తాత కృషి చాటి చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

తాత కృషి చాటి చెప్పాలి

Aug 14 2026 7:32 AM | Updated on Aug 14 2026 7:32 AM

తాత కృషి చాటి చెప్పాలి

జాతీయ జెండా రూపకల్పన చేసిన మా తాత పింగళి వెంకయ్యను ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా కీర్తించడం సంతోషకరం. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా పింగళి కుమార్తె అయిన మా అమ్మను తగు రీతిలో సత్కరించారు. భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు లేఖ కూడా రాశారు. నాకు పదిహేడేళ్ల వయస్సులో తాత మరణించారు. వారితో నాకున్న అనుబంధం, జ్ఞాపకాలు ఎప్పటికీ మరచిపోలేనివి. చాలా మందికి ఆయన జెండా రూపకర్తగా మాత్రమే తెలుసు. అయితే, ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు కూడా. ఒక సైనికుడిగా, పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా, గ్రంథకర్తగా.. ఏ రంగంలోనైనా తనదైన శైలిలో రాణించారు.

– జి.వి.ఎన్‌. నరసింహం,

(పింగళి వెంకయ్య మనుమడు),

‘పింగళి జీవిత చరిత్ర’ గ్రంథ రచయిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement