ప్రభుత్వ విద్య మిథ్యే | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విద్య మిథ్యే

Jun 12 2026 6:03 AM | Updated on Jun 12 2026 6:03 AM

నేడు పునఃప్రారంభం కానున్న పాఠశాలలు

జిల్లాలో విద్యారంగ సమాచారమిదీ...

టీడీపీ రెండేళ్ల పాలనలో బడులపై

అంతులేని నిర్లక్ష్యం

సిద్ధం కాని విద్యార్థి మిత్ర స్టూడెంట్‌ కిట్లు

పాఠ్యపుస్తకాల పంపిణీకే పరిమితం కానున్న టీడీపీ సర్కారు

ఇప్పటికే మూలకుచేరిన ఆర్వో ప్లాంట్లు

సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలకనున్న ప్రభుత్వ పాఠశాలలు

నేడు పునఃప్రారంభం కానున్న పాఠశాలలు

వేసవి సెలవుల అనంతరం జిల్లాలోని పాఠశాలలు శుక్రవారం పునఃప్రారంభం కానున్నాయి. సెలవుల్లో సేదదీరి తిరిగి వచ్చే విద్యార్థులకు టీడీపీ సర్కారు తీరుతో తీవ్ర నిరాశే మిగలనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికీ ఉచితంగా పంపిణీ చేయాల్సిప విద్యార్థి మిత్ర స్టూడెంట్‌ కిట్‌ను సిద్ధం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చతికిలపడింది. అంతులేని నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించింది. స్టూడెంట్‌ కిట్‌తోపాటు ఇవ్వాల్సిన సామగ్రిని సిద్ధం చేయడంలో విఫలమైన ప్రభుత్వం కేవలం పాఠ్య పుస్తకాల పంపిణీకే పరిమితం కానుంది.

గుంటూరు ఎడ్యుకేషన్‌ విద్యార్థులకు స్టూడెంట్‌ కిట్‌లో భాగంగా పుస్తకాల బ్యాగు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, రెండు జతల యూనిఫాం, బూట్లు, సాక్సులు, టై, బెల్టు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ, వర్క్‌బుక్స్‌ ఉచితంగా పంపిణీ చేయాలి. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 89,157 మంది విద్యార్థులకు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కిట్లు పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు మరో నెల రోజులకుపైగానే పట్టే పరిస్థితులు నెలకొన్నాయి.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు, వారి చదువులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. నాణ్యమైన సామగ్రితో కూడిన విద్యాకానుక స్టూడెంట్‌ కిట్లను వ్యక్తిగత పర్యవేక్షణతో సిద్ధం చేయించారు. ప్రతి ఏటా పాఠశాలలు తెరిచిన మొదటి రోజున ఒక పండుగలా విద్యాకానుక పంపిణీ నిర్వహించారు.

పాఠ్యపుస్తకాలకే పరిమితం

గుంటూరు జిల్లాలోని 18 మండలాల పరిధిలో 89,157 మంది విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ పాఠ్యపుస్తకాలు మాత్రమే ఇవ్వనున్నారు. కిట్‌లో భాగంగా అందించే పుస్తకాల బ్యాగు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, నోటు బుక్స్‌, వర్క్‌బుక్స్‌, బ్యాగులు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు, బూట్లు, సాక్సులు, టై, బెల్టు, పిక్టోరియల్‌ డిక్షనరీలు రావాల్సి ఉంది. 2019లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు కేవలం పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీకే పరిమితమైంది. వైఎస్‌ జగన్‌ చొరవతో రూపుదిద్దుకున్న విద్యాకానుక స్టూడెంట్‌ కిట్లను పేద, మధ్య తరగతి విద్యార్థులకు 10 రకాల సామగ్రితో ఉచితంగా పంపిణీకి శ్రీకారం చుట్టిన గత వైసీపీ ప్రభుత్వం నిరాటంకంగా విద్యార్థులకు అందజేసింది.

జిల్లా వ్యాప్తంగా పాఠశాలల సంఖ్య

1,730

జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య

3.49 లక్షలు

ప్రభుత్వ బడుల సంఖ్య

1,074

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 89,157

ప్రైవేటు పాఠశాలల సంఖ్య

656

ప్రైవేటు బడులలోని విద్యార్థుల సంఖ్య 2,60,354

ప్రభుత్వ విద్యార్థులకు ఇవ్వనున్న

పాఠ్యపుస్తకాలు: 15,26,181

Advertisement
 
Advertisement
Advertisement