వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడిగా నాగరాజు | - | Sakshi
Sakshi News home page

వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడిగా నాగరాజు

Jun 12 2026 6:03 AM | Updated on Jun 12 2026 6:03 AM

పాఠ్యపుస్తకాల కొరత వాస్తవమే అంతర్జాతీయ బాక్సింగ్‌ పోటీలకు గుంటూరు క్రీడాకారులు ఎంపిక

గుంటూరు మెడికల్‌: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) గా డాక్టర్‌ కోనేటి నాగరాజును నియమిస్తూ గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్‌గౌర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డాక్టర్‌ నాగరాజు వైఎస్సార్‌ కడప జిల్లా డీఎంహెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు పదోన్నతి కల్పించి గుంటూరు ఆర్డీగా బదిలీ చేశారు. డాక్టర్‌ నాగరాజు తిరుపతిలో 1983లో ఎంబీబీఎస్‌ అభ్యసించారు. కడప జిల్లా కదిరిలో 1993లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా విధుల్లో చేరి ప్రభుత్వ సర్వీసులోకి ప్రవేశించారు. డెప్యూటీ సివిల్‌ సర్జన్‌గా 2010లో, సివిల్‌ సర్జన్‌గా 2021లో పదోన్నతి పొందారు. రాజంపేట డెప్యూటీ డీఎంహెచ్‌ఓగా, వైఎస్సార్‌ కడప జిల్లా జిల్లా ఆసుపత్రిలో 13 సంవత్సరాల పాటు, వైఎస్సార్‌ కడప రిమ్స్‌లో ఐదు సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఫుల్‌ అడిషనల్‌ చార్జి ఆర్డీగా డాక్టర్‌ జి.శోభారాణి విధులు నిర్వహిస్తున్నారు. ఈమె జులై 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు.

డీఈఓ షేక్‌ సలీమ్‌ బాషా

గుంటూరు ఎడ్యుకేషన్‌ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విక్రయ పాఠ్య పుస్తకాలను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమైన ప్రభుత్వ తీరుపై మార్కెట్‌లోకి రాని పాఠ్య పుస్తకాలు శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీమ్‌ బాషా స్పందించారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాల కొరత ఉన్న వాస్తవేమనని, త్వరలోనే అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

జిల్లాలో సగటు వర్షపాతం 30.4 మి.మీ.

కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా మంగళగిరి మండలంలో 81.8 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా మేడికొండూరు మండలంలో 6.4 మి.మీ వర్షం కురిసింది. సగటున 30.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. తాడేపల్లి మండలంలో 77.6 మి.మీ., దుగ్గిరాల 70.8, తెనాలి 67.8, కొల్లిపర 47.4, చేబ్రోలు 45, తుళ్లూరు 28.8, పెదకాకాని 27.2, గుంటూరు పశ్చిమ 26.4, గుంటూరు తూర్పు 18.4, వట్టిచెరుకూరు 16.6, ఫిరంగిపురం 8.6, పొన్నూరు 8.6, తాడికొండ 8.2, ప్రత్తిపాడు మండలంలో 7.2 మి.మీ చొప్పున వర్షం కురిసింది.

కొరిటెపాడు(గుంటూరు): సబ్‌ జూనియర్‌ బాలబాలికల అంతర్జాతీయ బాక్సింగ్‌ పోటీలకు గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు బాక్సర్లు ఎంపికై నట్లు జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, వేద సీడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తులసి ధర్మ చరణ్‌ తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరంలో శుక్రవారం నుంచి 14వ తేదీ వరకు సబ్‌ జూనియర్‌ బాలబాలికల విభాగంలో ఈ పోటీలు జరగనున్నాయన్నారు. బాలికల విభాగంలో 40 కిలోల కేటగిరిలో ప్రజ్ణ దియా జోష్‌లిన్‌ ఎంపికై ందన్నారు. బాలుర విభాగంలో 70 కిలోల కేటగిరిలో శ్రీ కార్తికేయ, 55 కిలోల విభాగంలో జ్ఞాన సాయి, 35 కిలోల విభాగంలో చంద్రహౌస్‌ ఎంపికై నట్లు వివరించారు. ఈ క్రీడాకారులతో పాటు బాక్సింగ్‌ కోచ్‌ ఇమ్మానియేల్‌ రాజు కూడా పోటీలకు హాజరుకానున్నారని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న గుంటూరు జిల్లా బాక్సర్లు విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. బాక్సింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి డాక్టర్‌ కోలా చిరంజీవి మాట్లాడుతూ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు అసోసియేషన్‌ తరపున ఆర్తిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement