రాజధాని భూసేకరణలో పురోగతి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

రాజధాని భూసేకరణలో పురోగతి ఉండాలి

Jun 12 2026 6:03 AM | Updated on Jun 12 2026 6:03 AM

గుంటూరు వెస్ట్‌: రాజధాని భూముల భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రతివారం ఖచ్చితమైన పురోగతి ఉండాలని జిల్లా కలెక్టర్‌ సి.యం.సాయికాంత్‌ వర్మ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో సీఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్లు భార్గవ్‌ తేజ్‌ , కార్తీక్‌, జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవలతో కలసి రాజధాని భూసేకరణ గురించి కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ–3, ఈ–13, ఈ–15 పరిధిలోని సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, స్టీల్‌ బ్రిడ్జి తదితర నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియలో పెండింగ్‌ అంశాల గురించి చర్చించారు. భూసేకరణ ప్రక్రియలోని ప్రతి అంశానికి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయుటకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అసైన్‌న్డ్‌ భూములు, పట్టా భూములు విషయంలో నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు ఇతర శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో సంయుక్త తనిఖీలు నిర్వహించి ఎటువంటి పెండింగ్‌ లేకుండా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ సర్వే విషయంలో సంయుక్త తనిఖీలు త్వరగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్‌ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, సీఆర్‌డీఏ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సర్‌ అత్యంత కీలకం

ఎటువంటి లోపాలు, దొంగ ఓట్లు లేని ఒక సమగ్రమైన, పారదర్శకమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలకు పని చేయాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. గురువారం రాత్రి కలక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పై ఈఆర్‌ఓ లు, ఏఈఆర్‌ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ

Advertisement
 
Advertisement
Advertisement