కూటమి ప్రభుత్వం పనైపోయింది | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వం పనైపోయింది

Jun 9 2026 5:42 AM | Updated on Jun 9 2026 5:42 AM

మూడేళ్ల ముందే గ్రాఫ్‌ పడిపోయింది

వచ్చేది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే

అందుకే గొడ్డలి పార్టీగా చంద్రబాబు దుష్ప్రచారం

‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ సభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు

తెనాలి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పనైపోయిందని, రానున్నది జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇది గ్రహించినందునే చంద్రబాబు గొడ్డలి పార్టీ అంటూ దుష్రచారం చేస్తున్నారనీ, ఆయన తనయుడూ, విద్యాశాఖ మంత్రి ‘దగా డీఎస్సీ’పై నోరెత్తటం లేదన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ బహిరంగసభ సోమవారం స్థా నిక ఎం.కన్వెన్షను హాలులో నిర్వహించారు. పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ, గత ఎన్నికల హామీలను నెరవేర్చకుండానే చంద్రబాబునాయుడు అమలుచేశానని చెబుతూ ప్రజలను వెన్నుపోటు పోడిచాడని విమర్శించారు. వెన్నుపోటు పదం ఆయనతోనే వచ్చిందనీ, వెన్నుపోటుతోనే ఆయన అధికారంలోకి వచ్చా డని గుర్తుచేశారు. వైఎస్సార్‌ సీపీ స్వచ్ఛంగా ప్రజాక్షేత్రంలోంచి అధికారాన్ని చేపట్టిందని స్పష్టంచేశారు.

పొత్తులేనిదే బాబు గెలవలేడు

సభకు అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ, చంద్రబాబు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీచేయలేదని గుర్తుచేశారు. వైఎస్సార్‌ సీపీ మినహా అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, నాదెండ్ల భాస్కరరావు కుమారుడు మనోహర్‌ ఇద్దరూ కూటమిలో ఉన్నారని గుర్తుచేశారు. తాడేపల్లి నుంచి తెనాలికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెలికాప్టర్‌లో వచ్చారని మంత్రి మనోహర్‌ చేసిన విమర్శను ప్రస్తావిస్తూ కరకట్ట ప్యాలెస్‌ నుంచి సచివాలయానికి హెలికాప్టర్లో వచ్చిన చంద్రబాబు గురించి మాట్లాడరేమని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు, నియోజకవర్గ పరిశీలకుడు కాకుమాను సదాశివరెడ్డి, తెనాలి, కొల్లిపర ఎంపీపీలు ధర్మరాజుల చెన్నకేశవులు, భీమవరపు పద్మావతి, పార్టీ బూత్‌కమిటీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుదిబండి కృష్ణకిషోర్‌రెడ్డి, ప్రసాదం సురేష్‌, మర్రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, బూరెల నాంచారమ్మ, ఆళ్ల ఉత్తేజ్‌రెడ్డి,శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, గోల్డ్‌ రహిమా, కొడాలి క్రాంతి, దేవరపల్లి భూషణం, టి.యల్లమంద, బొల్లిముంత పోతురాజు, మైలా విజయ్‌నాయుడు, అవుతు శేఖర్‌రెడ్డి, కోలా వాసు, షేక్‌ వాసు, బొంతు గోపిరెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, కొర్ర యశోద, షేక్‌ దుబాయ్‌బాబు, నిట్టా బాలు, పి.అశోక్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు.

ఎన్నికలకు మూడేళ్ల ముందే కూటమి ప్రభు త్వం గ్రాఫ్‌ పడిపోయిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇది గ్రహించిన చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డిది గొడ్డలి పార్టీ అంటూ అన్‌పాపులర్‌ చేయాలని చూస్తున్నారని, అది ఆయ న వల్లకాదన్నారు. స్థానికసంస్థల ఎన్నికలు పెడితే సంగతేంటో తేలిపోతుందన్నారు. చంద్రబాబు జీవితమంతా మోసం చేసి అధికారంలోకి రావటం మినహా రుజుమార్గంలో ఏనాడూ రానేలేదని అంబటి రాంబాబు విమర్శించారు. మరోవైపు ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నట్టు చెబుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ప్రభుత్వ సలహాదారు కేఎన్నార్‌పై అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌ సీపీని అణచాలని ప్రయత్నిస్తున్నారని, అది సాధ్యం కాదన్నారు. క్రీడాకోటా శాతాన్ని ముందే పెంచుకుని దొంగ సర్టిఫికెట్లతో మెగా డీఎస్సీలో 421 పోస్టులు రిక్రూట్‌మెంట్‌ చేశారని ఆరోపించారు. ఈ మోసం విద్యార్థిలోకం ఉద్యమిస్తుంటే సంబంధిత శాఖామంత్రి నారా లోకేశ్‌ తేలుకుట్టిన దొంగలా మాట్లాడటం లేదన్నారు. లింగమనేని రమేష్‌ అక్రమ కట్టడంలో తండ్రీకొడుకులు ఉంటూ, ఆయన్ను జనసైనికుడుగా రాజ్యసభకు పంపుతున్నారని చెప్పారు. ఇందుకు ‘కలెక్షన్‌ కింగ్‌’ వంతపాడుతున్నారని అన్నారు. ఇల్లిస్తే, స్థలమిస్తే రాజ్యసభకు అర్హతగా తేల్చారని చెబుతూ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలో కష్టపడినవారినే రాజ్యసభకు పంపారని రాంబాబు గుర్తుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement