గుంటూరు మెడికల్: రోబోటిక్‌ల ప్రవేశంతో ఆధునిక వైద్యరంగం ఓ పెద్ద మలుపు తీసుకుందని ఏపీ ఏరో స్పేస్ డిఫెనన్స్ సలహాదారు, డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ జి సతీష్‌రెడ్డి అన్నారు. కచ్చితత్వంతో కూడిన రోబోటిక్ వైద్య సేవలు పేదలకు సైతం అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. తక్కువ ఖర్చుతో రోబోటిక్‌లను రూపొందించినప్పుడు అది సాధ్యపడుతుందని ఆ మేరకు పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సతీష్‌రెడ్డి తన ఆప్తమిత్రుడైన సీనియర్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఇంటికి భోజనాది కార్యక్రమాలకు హాజరయ్యారు. సతీష్‌రెడ్డిని బీఎంఆర్ గ్రూప్స్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, డాక్టర్ నరేంద్రరెడ్డి దంపతులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తనను కలిసిన మిత్రులతో సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధానమైన వైద్యరంగంలో శాస్త్ర సాంకేతికను సద్వినియోగపరచుకోవడంలో భారత్ అగ్రరాజ్యాల సరసన చేరిందన్నారు. గుంటూరు లాంటి చిన్న నగరంలో ఉన్న సాయి భాస్కర్ హాస్పిటల్‌లో అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన ’మాకో’ రోబో సేవలు అందుబాటులోకి రావడమే ఇందుకు ఉదాహరణగా తెలిపారు. డాక్టర్ నరేంద్రరెడ్డి మాట్లాడుతూ మెట్రోపాలిటన్ నగరాలకుకు దీటుగా ఇక్కడి వారికి తక్కువ ఖర్చుతో ఆధునిక సాంకేతికతతో కూడిన వైద్య సేవలను అందించడంలో తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ప్రస్తుతం గుంటూరు విజయవాడలోని రెండు హాస్పిటల్స్ లో రోబోటిక్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. భోజనం అనంతరం డాక్టర్ సతీష్‌రెడ్డిని బూసిరెడ్డి దంపతులు సత్కరించారు.
ఏపీ ఏరో స్పేస్ సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి


