వైఎస్సార్‌ సీపీలో నియామకాలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో నియామకాలు

Jan 24 2026 7:23 AM | Updated on Jan 24 2026 7:23 AM

వైఎస్

వైఎస్సార్‌ సీపీలో నియామకాలు

సమగ్రశిక్షలో డిప్యూటేషన్‌పై నియామకాలు

పట్నం బజారు (గుంటూరు ఈస్ట్‌): వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో పలువురుని పలు పదవుల్లో నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన మునిపల్లె సంపత్‌కుమార్‌ను రాష్ట్ర ఆర్‌టీఐ విభాగం కార్యదర్శిగా, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా పాటిబండ్ల కవిత, రాష్ట్ర మహిళా విభాగం సహాయ కార్యదర్శిగా కందుకూరి జ్యోతిలను నియమించారు.

తిరుమలలో అన్నదానం చేసిన భాష్యం రామకృష్ణ

గుంటూరు ఎడ్యుకేషన్‌: తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేసేందుకు రూ.44 లక్షలు విరాళంగా అందజేసిన భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ శుక్రవారం తిరుమలలోని శ్రీతరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. భాష్యం రామకృష్ణతో పాటు భాష్యం విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ భాష్యం హనుమంతరావు భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

గుంటూరులో సిగ్నేచర్‌

డైన్‌ రెస్టారెంట్‌ ప్రారంభం

నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌): గుంటూరులో అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా సిగ్నేచర్‌ డైన్‌ రెస్టారెంట్‌–కన్వెన్షన్‌ నెలకొల్పడం అభినందనీయమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. బృందావన్‌గార్డెన్స్‌ మూడో వీధిలో సిగ్నేచర్‌ డైన్‌ రెస్టారెంట్‌–కన్వెన్షన్‌ను శుక్రవారం మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్‌ అహ్మద్‌, మేయర్‌ కోవెలమూడి రవీంద్ర ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ అన్నిరకాల వేడుకలు నిర్వహించుకునేందుకు అనువుగా ఉందని అన్నారు. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మన్నవ యుగంధర్‌ మాట్లాడుతూ సిగ్నేచర్‌ డైన్‌ రెస్టారెంట్‌–కన్వెన్షన్‌ను సరికొత్త హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. వెజ్‌, నాన్‌వెజ్‌ రెస్టారెంట్‌, బాంకెట్‌/ కాన్ఫరెన్స్‌ హాల్‌, ఫంక్షన్‌ హాల్‌, గ్రాండ్‌ బెడ్‌రూమ్‌, గ్రాండ్‌ కంఫర్ట్‌ రూమ్స్‌, ఎగ్జిక్యూటివ్‌ రూమ్స్‌, గ్రాండ్‌ క్లబ్‌ సూట్‌ రూమ్స్‌ అన్ని రకాల వసతులతో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఆల్టర్నేటివ్‌ స్కూలింగ్‌ కో–ఆర్డినేటర్‌ (ఏఏఎస్‌ఎల్‌సీ) పోస్టులో ఫారిన్‌ సర్వీసు నిబంధనల ప్రకారం డిప్యూషన్‌ పై పని చేసేందుకు 55 ఏళ్లలోపు వయసు కలిగిన ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ షేక్‌ సలీమ్‌ బాషా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదేళ్లు సర్వీసు కలిగిన స్కూల్‌ అసిస్టెంట్‌, ఎనిమిదేళ్ల సర్వీసు కలిగిన ఎస్జీటీలలో ఆసక్తి గల వారు ఈనెల 31లోపు గుంటూరులోని సమగ్ర శిక్ష అభియాన్‌ కార్యాలయం నందు అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు సమగ్రశిక్ష గుంటూరు.బ్లాగ్‌స్పాట్‌.కామ్‌తో పాటు డీఈవో కార్యాలయంలోని సమగ్రశిక్ష విభాగంలో సంప్రదించాలని తెలిపారు.

వైఎస్సార్‌ సీపీలో నియామకాలు 1
1/2

వైఎస్సార్‌ సీపీలో నియామకాలు

వైఎస్సార్‌ సీపీలో నియామకాలు 2
2/2

వైఎస్సార్‌ సీపీలో నియామకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement