విజ్ఞాన్‌లో ప్రారంభమైన ‘ఏపీ స్పేస్‌ టెక్‌ సమ్మిట్‌’ | - | Sakshi
Sakshi News home page

విజ్ఞాన్‌లో ప్రారంభమైన ‘ఏపీ స్పేస్‌ టెక్‌ సమ్మిట్‌’

Jan 23 2026 6:51 AM | Updated on Jan 23 2026 6:51 AM

విజ్ఞ

విజ్ఞాన్‌లో ప్రారంభమైన ‘ఏపీ స్పేస్‌ టెక్‌ సమ్మిట్‌’

విజ్ఞాన్‌లో ప్రారంభమైన ‘ఏపీ స్పేస్‌ టెక్‌ సమ్మిట్‌’ ● ఏపీ ప్రభుత్వ మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో ప్రవేశించే యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు ఎదురుచూస్తున్నాయన్నారు. విద్యార్థులకు పరిశోధన, ఇంజినీరింగ్‌, డేటా విశ్లేషణ, సాఫ్ట్‌వేర్‌, ఉపగ్రహాల తయారీ, ప్రయోగ సాంకేతికత వంటి విభాగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ● విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధన ఉన్న చోట ఆ దేశం అభివృద్ధి చెందుతుందనే ఒక నానుడిని గుర్తు చేస్తూ, స్పేస్‌ టెక్నాలజీ కేవలం శాస్త్రవేత్తలకే పరిమితం కాకుండా, సమాజ అభివృద్ధికి ఉపయోగపడే సాధనంగా మారిందన్నారు. విజ్ఞాన్‌ యూనివర్సిటీ చాన్స్‌లర్‌ డాక్టర్‌ పావులూరి సుబ్బారావు, ఏపీ స్పేస్‌టెక్‌ అకాడమీ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ వి.శేషగిరిరావులు మాట్లాడారు.

సౌత్‌ ఇండియా రాకెట్రీ చాలెంజ్‌–2026 పోటీలు

చేబ్రోలు: వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీ, అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ స్పేస్‌టెక్‌ అకాడమీ మరియు హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆంధ్రప్రదేశ్‌ స్పేస్‌ టెక్‌ సమ్మిట్‌–2026’ను గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఏపీ స్పేస్‌ టెక్‌ సమ్మిట్‌ను ‘లెవరేజింగ్‌ స్పేస్‌ టెక్నాలజీ ఫర్‌ వికసిత్‌ భారత్‌–2047’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఏపీ స్పేస్‌ టెక్‌ అకాడమీ ఆధ్వర్యంలో పబ్లిష్‌ చేసిన ‘స్పేస్‌ టెక్‌ స్పెక్ట్రమ్‌ జర్నల్‌’ను ఆవిష్కరించారు. అమరావతిలోని సైన్స్‌ సిటీ ఆఫ్‌ ఏపీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ‘సౌత్‌ ఇండియా రాకెట్రీ చాలెంజ్‌–2026’ పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఇందులో కాలేజీ స్థాయి విద్యార్థులకు కెమికల్‌ రాకెట్రీ, స్కూల్‌ స్థాయి విద్యార్థులకు హైడ్రో రాకెట్రీ పోటీలు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌సీ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రకాష్‌ చౌహాన్‌ మాట్లాడుతూ భారత్‌ ‘స్పేస్‌ యుబిక్విటీ’ దిశగా దూసుకెళ్తోందని తెలిపారు.

సౌత్‌ ఇండియా రాకెట్రీ చాలెంజ్‌

సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన ‘సౌత్‌ ఇండియా రాకెట్రీ చాలెంజ్‌–2026’ లో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌, డిగ్రీ, స్కూల్‌, పాలిటెక్నిక్‌ విద్యాసంస్థల విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో భాగంగా విద్యార్థులు స్వయంగా చిన్న రాకెట్ల నమూనాలను రూపకల్పన చేసి, తయారు చేసి, లాంచ్‌ చేశారు. సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన స్టార్టప్‌ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏపీ సైన్స్‌ సిటీ సీఈఓ కేశినేని వెంకటేశ్వర్లు, విజ్ఞాన్‌ సీఈఓ డాక్టర్‌ కూరపాటి మేఘన, ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌, రిజిస్ట్రార్‌ పీఎంవీ రావు, మాజీ డీజీపీ మాలకొండయ్య పాల్గొన్నారు.

విజ్ఞాన్‌లో ప్రారంభమైన ‘ఏపీ స్పేస్‌ టెక్‌ సమ్మిట్‌’ 1
1/1

విజ్ఞాన్‌లో ప్రారంభమైన ‘ఏపీ స్పేస్‌ టెక్‌ సమ్మిట్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement