కనులారా మకరజ్యోతి దర్శనం
నగరంపాలెం: గుంటూరు సంపత్‌నగర్‌లోని క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ వారి శ్రీహరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకరజ్యోతి దర్శనం ఘనంగా జరిగింది. ట్రస్ట్, క్రేన్ సంస్థల చైర్మన్ గ్రంధి వెంకట సత్యలక్ష్మీకాంతారావు, లక్ష్మీహైమావతి దంపతులు, కుటుంబ సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి తిరువాభరణాలను సంపత్‌నగర్‌లోని ఫ్యాక్టరీ నుంచి దేవాలయానికి కాంతారావు దంపతులు, ఆయన అల్లుడు చక్కా వినోద్‌రామకృష్ణ, కుమార్తె విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు దేవాలయానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామి వారికి అలంకరించారు. రాత్రి భక్తుల స్వామి వారి శరణ ఘోష నడుము గ్రంధి కాంతారావు దంపతులు మకర జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం భక్తి గీతాల సంగీత విభావరి నిర్వహించారు. అయ్యప్ప భక్తులు, క్రేన్ గ్రూప్ సంస్థల సిబ్బంది, టంగుటూరి మణి, పుర ప్రముఖులు హాజరయ్యారు.
కనులారా మకరజ్యోతి దర్శనం


