ఆడబిడ్డను హింసిస్తుంటే మాట్లాడవేం నరేంద్ర ? | - | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డను హింసిస్తుంటే మాట్లాడవేం నరేంద్ర ?

Jan 14 2026 9:58 AM | Updated on Jan 14 2026 9:58 AM

ఆడబిడ్డను హింసిస్తుంటే మాట్లాడవేం నరేంద్ర ?

ఆడబిడ్డను హింసిస్తుంటే మాట్లాడవేం నరేంద్ర ?

పట్నంబజారు: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర...నీ దగ్గర పని చేసే వ్యక్తి తన భార్యను వేధింపులకు గురిచేస్తూ.. విపరీతంగా హింసిస్తుంటే.. సర్దిచెప్పాల్సింది పోయి స్వయంగా నువ్వు.. నీ కుమార్తె మేమున్నామని ప్రోత్సహించడం వల్ల ఒక బాధితురాలికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నరేంద్ర వద్ద పని చేసే పౌల్‌రాజ్‌ అనే వ్యక్తి తన భార్య వెంకటేశ్వరమ్మను చిత్రవధ చేస్తుంటే ప్రశ్నించినందుకు తనపై అక్రమ కేసు పెట్టించిన ఎమ్మెల్యే వారం రోజులుగా వెంకటేశ్వరమ్మ కనపడటంలేదని, ఆమె తల్లి నంబూరి లక్ష్మి పెడుతున్న కన్నీటికి సమాధానం చెపుతారా? అని ప్ర శ్నించారు. బృందావన్‌గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంళవారం విలేకరుల సమావేశంలో మురళీకృష్ణ బాధితురాలు తల్లి లక్ష్మితో కలసి మాట్లాడారు. ఆస్తి కోసం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరుడు పౌల్‌రాజ్‌ బరితెగించాడని ఆరోపించారు. వెంకటేశ్వరమ్మను ప్రేమ వివాహం చేసుకున్న పౌల్‌రాజ్‌ ఆస్తి కోసం తొలి నుంచి ఆమెను అనేక రకాల వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందన్నారు. ఒక తోటలో చెట్టుకు కట్టేసి కొడుతూ.. పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఆమె తల్లి నంబూరి లక్ష్మికి ఫోన్‌ చేసి వినిపిస్తూ హింసించాడని పేర్కొన్నారు. బాధ్యత గత ఎమ్మెల్యేగా మహిళను కాపాడాల్సిపోయి పౌలరాజ్‌ అరాచకాలను ప్రోత్సహిస్తున్నాడని మండిపడ్డారు. నాకు ఎమ్మెల్యే సపోర్ట్‌ ఉందని, నన్ను ఎవరు ఏమి చేయలేరని, నీకు చేతనైంది చేసుకో అని పౌలరాజ్‌ బెదిరింపులకు దిగిన ఆడియోలు ఉన్నాయన్నారు. వెంకటేశ్వరమ్మను కిడ్నాప్‌ చేసి, మాచవరంలోని పౌల్‌రాజ్‌ సోదరుడు రాజేష్‌ నివాసంలో పెట్టారని చెబుతున్నారని, తక్షణమే ఆ యువతిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉందన్నారు. తక్షణమే బాధితురాలు ఎక్కడ ఉందో ఆచూకీ తెలపాలని, పౌలరాజ్‌ నుండి వెంకటేశ్వరమ్మను రక్షించాలని, లేకుంటే ఆమె తల్లి నిరాహారదీక్షకు కూడా కూర్చుంటుందని చెబుతోందన్నారు. ఆస్తికోసం భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్న పౌలరాజ్‌ పై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

నా కుమార్తెను చంపే ప్రయత్నం జరుగుతోంది..

కిడ్నాప్‌కు గురైన బాధితురాలు వెంకటేశ్వరమ్మ తల్లి నంబూరి లక్ష్మి మాట్లాడుతూ తన కుమార్తెను చంపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే బంగారం, డబ్బులు ఎన్నోసార్లు పౌల్‌రాజుకు ఇచ్చా మని అయినా తన కుమార్తైపె వేధింపులు ఆగటం లేదన్నారు. ఎకరం ఆస్తి కోసం ప్రేమ వివాహం చేసుకుని, చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అండతో అల్లుడు పౌల్‌రాజ్‌ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. ఉన్న ఎకరం ఆస్తి కూడా ఇస్తానని, తన కూతురును ప్రాణాలతో అప్పజెప్పాలని వేడుకుంది. ఎమ్మెల్యే నరేంద్ర, పోలీసు అధికారులు స్పందించాలని తన కుమార్తెను క్షేమంగా తీసుకుని రావాలని విన్నవించారు. పౌల్‌రాజ్‌ బెదిరింపుల ఆడియోకాల్స్‌ రికార్డింగ్లు, ఎమ్మెల్యే ధూళిపాళ్ళతో ఉన్న ఫొటోలను ప్రదర్శించారు.

అభివృద్ధికి వైఎస్సార్‌ సీపీ వ్యతిరేకంగా కాదు

వైఎస్సార్‌ సీపీ ఏ రోజు అభివృద్ధికి వ్యతిరేకం కాద న్న విషయాన్ని గుర్తించాలని వైఎస్సార్‌ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ స్ప ష్టం చేశారు. రైతులు నష్టపోకుండా అభివృద్ధి చేయాలనేదే తమ ఉద్దేశమన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో నుంచి వెళ్తున్న ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అంత భూమి అవసరం లేదని అభిప్రాయపడ్డారు. నారాకోడూరు వద్ద ఉన్న 80 ఎకరాలు సరిపోతుందని రైతులు చెప్తుంటే, అధికారులు 650 ఎకరాలకు మార్కింగ్‌ పెట్టారని, ఎలాంటి ముందస్తు నోటీసులు, గ్రామసభలు లేకుండా భూసేకరణ చేపట్టడం సరైన విధానం కాదన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్య క్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న కాలనీలకు అవసరం మేరకు మాత్రమే తగిన నష్ట పరిహారం చె ల్లించి భూములు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నారాకోడూరు రైతులు వైఎస్‌ జగన్‌ను కలవాలి అనుకుంటే.. వారిని కలిసేందుకు కావాల్సిన ప్రయత్నం చే స్తామని హామినిచ్చారు. వ్యాపార దక్పథంతో, ఎమ్మె ల్యే ధూళిపాళ్ల నరేంద్ర కోరిక మేరకు మాత్రమే భూ సేకరణ జరుగుతోందని ఆరోపించారు. రైతుల సంతృప్తి మేరకు భూసేకరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల పాలిట శాపంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల మారారని మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరిగితే పోరాటం తప్పదని హెచ్చరించారు.

వైఎస్సార్‌ సీపీ పొన్నూరు నియోజకవర్గ

సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement