నేడు మంగళగిరికి మారిషస్‌ అధ్యక్షుడు | - | Sakshi
Sakshi News home page

నేడు మంగళగిరికి మారిషస్‌ అధ్యక్షుడు

Jan 5 2026 10:55 AM | Updated on Jan 5 2026 10:55 AM

నేడు

నేడు మంగళగిరికి మారిషస్‌ అధ్యక్షుడు

నేడు మంగళగిరికి మారిషస్‌ అధ్యక్షుడు చందన అలంకరణలో శ్రీవారు సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని రైల్వేస్టేషన్‌రోడ్‌లో గల అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆదివారం శ్రీవారిని చందనంతో అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీవారిని ముత్యాల పందిరిపై కూర్చోబెట్టి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. తైక్వాండో పోటీల్లో 8 మందికి బంగారు పతకాలు తెనాలిఅర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ తైక్వాండో చాంపియన్‌ షిప్‌లో ఎనిమిది మందికి బంగారు పతకాలు లభించాయని కోచ్‌ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో 25 మంది పాల్గొన్నారని, 10 మందికి వెండి, నలుగురుకి కాంస్య పతకాలు లభించినట్లు చెప్పారు. పోటీలను గత నెల 28, 29 తేదీల్లో తెనాలిలో నిర్వహించినట్లు వివరించారు. పతకాలు సాధించిన వారిని ఆదివారం తైక్వాండో కార్యాలయంలో అభినందించారు. కార్యక్రమంలో అంగలకుదురు సర్పంచ్‌ కె.నాగభూషణం, గణేష్‌ యూత్‌ కన్వీనర్‌ వీరవల్లి మురళి, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ వైకుంఠపురం కార్యదర్శి జీవీ నారాయణ, ముప్పవరపు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అమృత వర్షిణిగా బగళాముఖి పశ్చిమ డెల్టాకు నీటి విడుదల

మంగళగిరి టౌన్‌: మారిషస్‌ దేశ అధ్యక్షుడు ధరమ్‌ బీర్‌ గోకుల్‌ సోమవారం మంగళగిరి రానున్నారు. ఆయన ఉదయం లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన ఎగువ, దిగువ సన్నిధిలోని స్వామివార్లను దర్శించుకోనున్నట్లు ఆ లయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 7 గంటలకు ధరమ్‌ బీర్‌ గోకుల్‌ ఆలయానికి రానున్నారని, సంబంధిత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం అమృత వర్షిణి అలంకారంలో పూజలందుకున్నారు. అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది.

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి పశ్చిమ డెల్టాకు 2,304 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యాంక్‌ కెనాల్‌కు 106 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 306, పశ్చిమ కాలువకు 126, నిజాంపట్నం కాలువకు 168, కొమ్మూరు కాలువకు 1,271 క్యూసెక్కులు విడుదల చేసినట్లు తెలిపారు.

నేడు మంగళగిరికి  మారిషస్‌ అధ్యక్షుడు 
1
1/3

నేడు మంగళగిరికి మారిషస్‌ అధ్యక్షుడు

నేడు మంగళగిరికి  మారిషస్‌ అధ్యక్షుడు 
2
2/3

నేడు మంగళగిరికి మారిషస్‌ అధ్యక్షుడు

నేడు మంగళగిరికి  మారిషస్‌ అధ్యక్షుడు 
3
3/3

నేడు మంగళగిరికి మారిషస్‌ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement