మంగళగిరిలో యువత భారీ ర్యాలీ
మంగళగిరి టౌన్: జననేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల ఆధ్వర్యంలో మంగళగిరిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళగిరి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయం నుంచి పాత మంగళగిరి వరకు, అక్కడి నుంచి జాతీయ రహదారిపై నుండి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి కట్ చేశారు. సుమారు 800 మందికి పైగా వివిధ విభాగాల యువత పాల్గొని జగనన్న పుట్టినరోజు వేడుకలను విజయవంతం చేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా యూత్ ప్రెసిడెంట్ ఉత్తేజ్‌రెడ్డి, మంగళగిరి నియోజకవర్గ విద్యార్థి విభాగ అధ్యక్షులు పులగం సందీప్‌రెడ్డి, మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ గౌస్‌మొహిద్దీన్, మంగళగిరి మండల, పట్టణ, రూరల్ యువజన విభాగ అధ్యక్షులు మాదాల గోపి, కె.గోపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చిన్నారి యాదవ్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జి భీమిరెడ్డి శరణ్ కుమార్ రెడ్డి, కొల్లిపర మండల యువత అధ్యక్షులు యశ్వంత్ రెడ్డి పాల్గొన్నారు.
అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేల తాట తీయండి
వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్
తాడికొండ: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తాట తీస్తా చాలా మందికి రోమాలు లెక్కబెడతా అని మాట్లాడుతున్నాడని, ఆయన ఆ మాటలు మాట్లాడే ముందు మీ మాట వినని అవినీతి, అక్రమాలు, భూ సెటిల్‌మెంట్‌కు పాల్పడుతున్న జనసేన పార్టీ ఎమ్మెల్యేల తాట తీయాలని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్ అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఏర్పాటు చేసిన భారీ రక్తదాన, అన్నదాన శిబిరాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ల్యాండ్ సెటిల్‌మెంట్ విషయంలో నిన్నే డబ్బులు అడిగిన మీ ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, అవినీతికి రసీదులు ఇచ్చి సంవత్సరానికి రూ.5–6 కోట్లు వసూలు చేస్తానని చెప్పిన మీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అమ్మాయిలను లోబర్చుకున్న జానీ మాస్టర్ లాంటి వాళ్ల తాట తీయాలని అన్నారు. కులాలు, మతాల పేరుతో దూషిస్తున్న జనసేన నాయకుల తాట తీయాలని పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పరిగెత్తుకొని ముందుకెళుతుందని పవన్ అంటున్నారని 18 నెలల్లో రూ.2.65 లక్షల కోట్లు అప్పులు తీసుకున్నందుకు అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా ఈ రాష్ట్రం ముందుకెళుతుందా అని ప్రశ్నించారు. జగన్‌మోహన్‌రెడ్డిపై పవన్ ఇష్టాను సారం మాట్లాడడం కాదని దమ్ము, ధైర్యం ఉంటే జగన్‌మోహన్‌రెడ్డి పాలనతో పోటీపడి ఆయన కంటే మెరుగ్గా పాలన చేయండి అంతే కానీ చావలేని మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడకుండా పాలన మీద, మీ ఎమ్మెల్యేలను గాడిలో పెట్టుకునేలా దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్‌కు ఆయన సూచించారు. కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా బాల వజ్రబాబు(డైమండ్) పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంగళగిరిలో యువత భారీ ర్యాలీ
మంగళగిరిలో యువత భారీ ర్యాలీ


