ఉండవల్లిలో ఫ్లెక్సీలు చింపింవేసిన గుర్తుతెలియని వ్యక్తు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీలను ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చింపివేశారు. పార్టీ ఉండవల్లి కమిటీ అధ్యక్షులు వీర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ వాళ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నా ఉండవల్లిలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదని ఎవరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా ఒకేచోట, పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారని ఎవరైనా వేరే పార్టీవారి ఫ్లెక్సీ ఉంటే మర్యాదపూర్వకంగా మాట్లాడుకుని తొలగిస్తారని, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చించివేయడం దారుణమన్నారు.
తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా నాగయ్య మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో ఇటువంటి విష సంస్కృతి ఎప్పుడూ లేదని, ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూడా ఇటువంటి విషయాలపై దృష్టి సారించి, ఫ్లెక్సీలు చించిన వారు ఏ పార్టీ వారు అయినా కఠినంగా శిక్షించాలని కోరారు. శనివారం రాత్రి 12 గంటలకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రి 2 గంటలకు చింపివేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
ఎవరి ఫ్లెక్సీలకు వారే బాధ్యులు: సీఐ వీరేంద్ర
ఏ పార్టీ వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే అవి ఎవరు చించినా మాకు ఎటువంటి సంబంధం లేదని, ఫ్లెక్సీలు ఏ పార్టీ వారు ఏర్పాటు చేసుకుంటే ఆ పార్టీ వారే సంరక్షించుకోవాలని సీఐ వీరేంద్ర తెలిపారు. ఫ్లెక్సీలు తొలగిస్తే వెంటనే మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
పోలీసులకు వైఎస్సార్‌సీపీ నాయకుల ఫిర్యాదు
ఉండవల్లిలో ఫ్లెక్సీలు చింపింవేసిన గుర్తుతెలియని వ్యక్తు


