మాతృత్వం ఓ వరం.. దత్తత మరో మార్గం!
అనధికార దత్తత చట్టరీత్యా నేరం అర్హతగల వారికి అండగా శిశు గృహ జాతీయ దత్తత మాసోత్సవాలు
సత్తెనపల్లి: వివాహమై ఎన్నో ఏళ్లు గడిచినా సంతాన సాఫల్యానికి నోచని దంపతులకు దత్తత ఓ వరం. దత్తత తీసుకోవడంలోనూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. అనధికార దత్తత చట్ట రీత్యా నేరం. కొంతమంది ఈ విషయం తెలియక దళారుల చేతిలో మోసపోతున్నారు. జాతీయ దత్తత మాసోత్సవం సందర్భంగా నెలరోజుల పాటు సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఒకటిన ప్రారంభమైన జాతీయ దత్తత మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు, సదస్సులు ఈ నెల 30 వరకు నిర్వహించనున్నారు. దత్తత తీసుకునేందుకు ఉండాల్సిన అర్హతల గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.
అర్హతలు ..


