గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Nov 23 2025 5:51 AM | Updated on Nov 23 2025 5:51 AM

గుంటూ

గుంటూరు

ఆదివారం శ్రీ 23 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 సాగర్‌ నీటిమట్టం పశ్చిమ డెల్టాకు నీటి విడుదల

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 23 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం శనివారం 584.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 36,765 క్యూసెక్కు లు వచ్చి చేరుతోంది.

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజి నుంచి పశ్చిమ డెల్టాకు 4,227 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉంది.

ఈ రైతు పేరు గుంటుపల్లి ఉపేంద్రరావు. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడుకు చెందిన ఆయన ఈ ఏడాది 65 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎకరాకు రూ. 45 వేల వరకు పెట్టుబడి పెట్టారు. పత్తి తీతలకు అదనంగా మరో రూ. 10 వేలు ఖర్చు అయింది. తుపానుకు ముందు వరకూ ఎకరాకు 15 క్వింటాలు వస్తుందని భావించారు. తుపాను దెబ్బకు దిగుబడి నాలుగు, ఐదు క్వింటాళ్లకు పడిపోయింది. పెట్టుబడిలో సగం అయినా వస్తుందో రాదో తెలియని పరిస్థితి. నాలుగు రోజుల కిందట 170 క్వింటాల పత్తిని కోయవారిపాలెంలోని ఒక సీసీఐ కేంద్రానికి తీసుకెళ్లారు. పత్తిలో కాయ ఉంది కొనబోమని చెప్పారు. అక్కడే బ్లోయర్‌ వేసి గ్రేడింగ్‌ చేశారు. తరుగు పోయి 160 క్వింటాళ్లకు చేరింది. అమ్మగా వచ్చిన నగదును కూలీల ఖర్చుల కింద చెల్లించారు.

ఈయన పేరు బట్టిపాటి శ్రీనివాసరావు. ప్రత్తిపాడుకు చెందిన రైతు. ఆరు ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎకరాకు సుమారు రూ. 50 వేల వరకు ఖర్చు అయింది. ఇప్పటి వరకు ఒక తీత తీశారు. రెండవ తీతకు సిద్ధంగా ఉంది. మొదటి తీతకు వచ్చిన దిగుబడిని విక్రయిస్తే కనీసం కూలీ ఖర్చులకు కూడా చెల్లించే పరిస్థితి లేదు. తుపానుకు ముందు పది క్వింటాళ్లు ఎకరాకు వస్తుందని భావించారు. తరువాత దిగుబడి నాలుగు నుంచి ఐదు క్వింటాళ్లకు పడిపోయింది. మామూలుగా మూడు, నాలుగు తీతలు రావలసిన పత్తి రెండు తీతలతోనే ముగిసేలా ఉంది. వచ్చిన పత్తిని సీసీఐకి తీసుకెళ్లారు. కానీ అక్కడకు వెళ్లిన వారంతా వెనక్కు వస్తుండటంతో ఆందోళన చెందారు. కనీస మద్దతు ధర దక్కక, దళారులకు తెగనమ్ముకోలేక ఆవేదన చెందుతున్నారు.

పత్తి రైతుల కడుపు రగిలిపోతోంది. సాగు చేసిన పత్తి తుపాను దెబ్బకు దెబ్బతినడంతోపాటు కనీస మద్దతు ధర లేకపోవడం, ప్రభుత్వం ప్రకటించిన ధరకు సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతూ తిరస్కరిస్తుండటంతో పత్తి రైతు గుండె తరుక్కుపోతుంది. పత్తితీతలు కూడా కాకముందే పంటను దున్నేస్తున్నారు. అక్కడికక్కడే కూలీలతో పంటను పీకి వేయించి, గుట్టలుగా పోగేసి నిప్పు పెడుతున్నారు. ఇటీవల పెదనందిపాడు మండలం నాగులపాడు, పెదనందిపాడు గ్రామాల్లో రైతులు తాము సాగు చేసిన పంటకు ఇలాగే నిప్పుపెట్టారు. చంద్రబాబు సర్కారు మాత్రం రైతులను ఆదుకునేందుకు కనీస చర్యలు తీసుకోవడం లేదు.

పత్తి రైతు తెల్లబోతున్నాడు. పదిహేను క్వింటాళ్లు రావలసిన దిగుబడి మోంథా తుపాను దెబ్బకు నాలుగు క్వింటాళ్లకు పడిపోయింది. ధర రాక దిగాలు చెందుతున్న రైతుల కష్టాన్ని దళారులు మింగేస్తున్నారు. తేమ శాతం నిబంధనతో సీసీఐ కర్కశంగా తిరస్కరిస్తుండటం, బయట మార్కెట్‌లో రూ.మూడు, నాలుగు వేలకు క్వింటా అడుగుతుండటంతో అవుతున్నాడు. తెచ్చిన అప్పులు పెట్టుబడులకే అయిపోగా, కూలీలకు ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేక అయినకాడికి తెగనమ్ముకుంటున్నాడు.

ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంలోని సీసీఐ కేంద్రంలో బయ్యర్లు

తిరస్కరించడంతో వెనక్కు వెళుతున్న పత్తి లోడు ట్రాక్టర్లు (ఫైల్‌)

7

గుంటూరు1
1/5

గుంటూరు

గుంటూరు2
2/5

గుంటూరు

గుంటూరు3
3/5

గుంటూరు

గుంటూరు4
4/5

గుంటూరు

గుంటూరు5
5/5

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement