చట్టాలపై అవగాహన అవసరం
● గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జిల్లా ప్రధాన
న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి
● విజ్ఞాన్‌లో న్యాయ సేవలపై అవగాహన శిబిరం ● గుంటూరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ కమ్ సివిల్ జడ్జ్ (సీనియర్ డివిజన్) సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ జనసామాన్యానికి ఉచిత న్యాయ సహాయం, లీగల్ ఏయిడ్ క్లినిక్స్, మహిళల–పిల్లల రక్షణ పథకాలపై సమగ్రంగా వివరించారు. సామాన్య ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండేందుకు న్యాయ సేవల అథారిటీ చేపడుతున్న సేవలను వివరించారు. న్యాయ అవగాహన, యువత న్యాయపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలను వివరించారు.
● గుంటూరు మొదటి అడిషినల్ సివిల్ జడ్జ్ (సీనియర్ డివిజన్) వై.గోపాల కృష్ణ మాట్లాడుతూ డ్రగ్ దుర్వినియోగం ప్రభావంపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం యువతలో డ్రగ్ అబ్యూస్ తీవ్రమైన సమస్యగా మారుతోందన్నారు. చిన్న వయసులోనే చాలా మంది డ్రగ్ అడిక్ట్స్‌గా మారుతున్నారు. గంజాయి, హెరాయిన్, కొకై న్ వంటి నిషేధిత మాదక ద్రవ్యాలను వాడటం వలన యువత డిప్రెషన్‌లో పడిపోతున్నారన్నారు. ఒంటరిగా ఉండటం, సామాజిక భావన కోల్పోతున్నారన్నారు. కుటుంబాలు, సమాజం, భవిష్యత్తు అన్నీ దెబ్బతింటాయి అని వివరించారు.
● గుంటూరు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రి సంఘటిత రంగ కార్మికుల సంక్షేమం, కార్మిక చట్టాలపై స్పష్టతనిచ్చారు. వివిధ రంగాల కార్మికులకు అందుబాటులో ఉన్న పథకాల గురించి వివరించారు. అనంతరం మహిళా కార్మికులకు ఈ–శ్రమ్ కార్డులను, పురుషులకు హెల్మెట్లను అందజేశారు. వివిధ పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించిన పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు మెమొంటోలను అందజేసారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చేబ్రోలు: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని, దేశానికి బలమైన స్తంభాలుగా ఎదగాలని గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. సంవిధాన దివాస్ సందర్భంగా ‘కాన్ట్సిట్యూషన్ వీక్ సెలబ్రేషన్స్–2025’లో భాగంగా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లా, గుంటూరులోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీల సంయుక్త ఆధ్వర్యంలో నల్సా నూతన మాడ్యూల్ – అవగాహన శిబిరంను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసంఘటిత రంగ కార్మికుల హక్కులు, డ్రగ్ దుర్వినియోగ నివారణ, మోటార్ వాహనాల చట్టం–1988, యాంటీ ర్యాగింగ్ వంటి సామాజిక మరియు న్యాయ సంబంధిత కీలక అంశాలపై నిపుణులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ చట్టాల మీద ప్రతి పౌరుడికి అవగాహన ఉండటం అత్యంత ముఖ్యమన్నారు. చట్టాలను తెలుసుకోవడం వల్లే తమ హక్కులు, బాధ్యతలు ఏంటో ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోగలరని చెప్పారు. ప్రతి భారతీయుడికి భారత రాజ్యాంగం మన హక్కులు, స్వేచ్ఛలు, విలువలను కాపాడే జీవనశైలిని నేర్పుతుందని వివరించారు.
1/1
చట్టాలపై అవగాహన అవసరం