
లాంచీస్టేషన్ ఆదాయం రూ.1,78,450
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు శనివారం పర్యాటకులు లాంచీలలో తరలి వెళ్లడంతో లాంచీస్టేషన్‌కు రూ.1,78,450 ఆదాయం సమకూరినట్లు యూనిట్ అధికారులు పేర్కొన్నారు. కొండను సందర్శించిన పర్యాటకులు మహాస్తూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం, మ్యూజియంలోని తొమ్మిది అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు.
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు మల్లికార్జునపేటలోని గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం అమ్మవారిని లక్ష గాజులతో శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర శర్మ, రామకృష్ణ భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందించారు.
మాచర్ల: మాజీ ఎంపీపీ బూడిద వెంకమ్మ కుమారుడు శ్రీనివాస్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, వివరాలు చెప్పకుండా తీసుకెళ్లారు. మాజీ ఎంపీపీ బంధువులు అందరూ మాచర్ల రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. శుక్రవారం రాత్రి బూడిద శ్రీనివాస్‌ను విజయపురి సౌత్ పోలీసు స్టేషన్‌కు సంబంధించిన కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు చూపించారు. శ్రీనివాస్‌కు మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
తెనాలి రూరల్: గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చెందిన రౌడీషీటర్ వేము నవీన్‌పై పీడీ యాక్ట్ నమోదైంది. జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అతడిని అదుపులోకి తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెనాలి టూటౌన్ సీఐ రాములనాయక్ శనివారం తెలిపారు. నవీన్‌పై గతంలో కొట్లాట, దోపిడీ, గంజాయి కేసులు నమోదయ్యాయి. ఇటీవల కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై దాడి కేసులో నవీన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ, రౌడీషీటర్లపై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నవీన్‌పై పీడీ యాక్టు నమోదైందని సీఐ వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
కర్లపాలెం: కర్లపాలెంలో కాలువ వంతెనకు సైడ్‌వాల్స్ లేకపోవటంతో ఓ కారు కాలువలోకి బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు శనివారం కర్లపాలెంలోని బాపయ్య కొట్టు ఎదుట పాత ఇస్లాంపేటకు వెళ్లే ఇసుక చానల్ వంతెనపై నుంచి ఓ కారు కాలువలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కాలువలో నీరు ఉండటం వల్ల కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.

లాంచీస్టేషన్ ఆదాయం రూ.1,78,450

లాంచీస్టేషన్ ఆదాయం రూ.1,78,450

లాంచీస్టేషన్ ఆదాయం రూ.1,78,450