
గుంటూరు వైద్య కళాశాలకు రూ.25 లక్షల విరాళం
క్యాంటీన్ పునర్నిర్మాణానికి అందించిన డాక్టర్ జె.నరేష్‌బాబు కుటుంబం
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో క్యాంటీన్ నిర్మాణం కోసం గుంటూరుకు చెందిన మల్లిక స్పైయిన్ సెంటర్ అధినేత జె.నరేష్‌బాబు కుటుంబం రూ. 25 లక్షలు విరాళం ఇచ్చింది. పునర్నిర్మాణం చేసిన క్యాంటీన్‌ను కళాశాల మాజీ ప్రిన్సిపాల్, డాక్టర్ జె.నరేష్‌బాబు తల్లి డాక్టర్ ఓలేటి శివలీల ముఖ్య అతిథిగా శనివారం ప్రారంభించారు. నరేష్‌బాబు 1991లో ఎంబీబీఎస్, పీజీ చదివారు. ఆయన తండ్రి రంగస్వామి గుంటూరు జీజీహెచ్ క్యాన్సర్ విభాగంలో పనిచేశారు. ఆయన సోదరుడు డాక్టర్ మహేష్‌బాబు ఇదే కళాశాలలో 1990లో ఎంబీబీఎస్ చదివి కార్డియాల జిస్ట్‌గా సేవలందిస్తున్నారు. మహేష్‌బాబు భార్య డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్ తర్వాత గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. జె.నరేష్‌బాబు భార్య నీలిమ పెథాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. మరో సోదరుడు డాక్టర్ రంగనాఽథ్ ఈ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. రంగనాథ్ భార్య రాధిక గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి పిలుపు మేరకు వీరి కుటుంబం రూ. 25 లక్షలు విరాళంగా అందించింది. ఎన్.వి.సుందరాచారి దాతలను సత్కరించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ మాధవి తదితరులు పాల్గొన్నారు.