
నిర్ణీత గడువులోగా ఫిర్యాదులకు పరిష్కారం
నగరంపాలెం: కన్న కొడుకే ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఓ మాతృమూర్తి వాపోయింది. ఈ మేరకు నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ)లో ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసింది. కార్యక్రమంలో బాధితుల నుంచి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను అలకించారు. ఆయా సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ ఫోన్‌లో మాట్లాడారు. నిర్ణీత గడువు లోగా చట్టపరిధిలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. బాధితుల పట్ల నిర్లక్ష్యం చూపవద్దని స్పష్టం చేశారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా డీఎస్పీ), శివాజీరాజు (సీసీఎస్) అర్జీలు స్వీకరించారు.
భారత్‌పేట వద్ద ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు ప్లాట్లు వేర్వేరుగా కొనుగోలు చేశాం. ఓ వ్యక్తి ఇనిస్టిట్యూట్ కంటూ రెండు ప్లాట్‌లు అద్దెకు తీసుకున్నాడు. మొదట్లో నెల నెలా అద్దె చెల్లించేవాడు. అయితే ఇనిస్టిట్యూట్‌కు విద్యార్థులు రావడంలేదనే సాకుతో అద్దె చెల్లించడం మానేశాడు. అయితే ఆ రెండు ప్లాట్లను వేరే వారికి అతను అద్దెకు ఇచ్చినట్లు తెలిసింది. అదేమని అడిగితే పొంతన లేని సమాధానం చెబుతున్నాడు. ఖాళీ చేయడం లేదు.. న్యాయం చేయగలరు.
– కాలేషావలి, కుమారి, ప్లాట్ల యజమానులు గుంటూరు
జిల్లా ఎస్పీ సతీష్ కుమార్