మోసపోయాం.. న్యాయం చేయండి
నగరంపాలెం: ఉద్యోగాల పేర్లతోనూ, డ్వాక్రా రుణాలు ఇప్పిస్తామంటూ మోసగించారని బాధితులు వాపోయారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల అర్జీలను జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), కె.సుప్రజ (క్రైం), హనుమంతు (ఏఆర్) స్వీకరించారు. సంబంధిత పోలీస్ అధికారులకు మొబైల్ ద్వారా బాధితుల సమస్యలను వివరించారు. త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ అర్జీలు స్వీకరించారు.
పోలీసు పీజీఆర్‌ఎస్‌లో బాధితుల మొర ఫిర్యాదులు స్వీకరించిన ఏఎస్పీలు


