గత ప్రభుత్వంలో వెంటనే ఆదుకున్నారు
నేను కౌలు రైతును. ఖరీఫ్‌లో 1.5 ఎకరాల్లో అరటి, రెండెకరాల్లో పసుపు సాగు చేశాను. ఎకరాకు రూ.60 వేలు కౌలు. ఎకరాకు 1200 చక్కెరకేళి మొక్కలు వేశాను. పంటంతా అరకాయపై ఉన్న సమయంలో మోంథా తుపానుతో 500 వరకు అరటి చెట్లు పడిపోయాయి. రూ.1.50 లక్షల నష్టం వచ్చింది. అధికవర్షాలు, మోంథా తుపానుకు పసుపు దుంప గిడసబారి పుచ్చు వచ్చింది. చేతికొచ్చేది ఏమీ కనిపించడం లేదు. కొద్దిరోజుల్లో దున్నేసి మొక్కజొన్న వేయాలని చూస్తున్నా. అరటి, పసుపును అధికారులు, సిబ్బంది వచ్చి చూసి వెళ్లారు మినహా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. గాలికి అరటి పడిపోతే నష్టపరిహారం ఉండదని చెప్పారు. గత ప్రభుత్వంలో పంటలకు ఉచిత బీమా చేశారు. వరదలకు పంట నష్టపోతే రోజుల వ్యవధిలోనే పరిహారం అందించారు.
–గుదిబండి శేషిరెడ్డి, కౌలురైతు, గుదిబండివారిపాలెం


