మోంథా తుపాను సాయంపై చంద్రబాబు మాటలు | - | Sakshi
Sakshi News home page

మోంథా తుపాను సాయంపై చంద్రబాబు మాటలు

Dec 25 2025 8:21 AM | Updated on Dec 25 2025 8:21 AM

మోంథా

మోంథా తుపాను సాయంపై చంద్రబాబు మాటలు

మోంథా తుపాను సాయంపై చంద్రబాబు మాటలు

నెలలు గడుస్తున్నా రైతులకు అందని తుపాను సాయం జిల్లాలో 6,062.21 ఎకరాల్లో పంటలకు నష్టం 33 శాతం కన్నా ఎక్కువగా నష్టపోతేనే పరిహారం అందజేస్తామన్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అధికారుల సర్వే 3,800 మంది రైతులు పంటలు నష్టపోయినట్లు గుర్తింపు ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు, రైతు సంఘాలు

రూ.2.50 లక్షల నష్టం

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకునే చంద్రబాబు వారిని ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అడుగడుగునా వంచిస్తున్నారు. మోంథా తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందజేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాయం అందజేస్తే కనీసం రబీ పంటల సాగు ఖర్చులకు ఉపయోగపడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు.

రైతుల ఎదురుచూపులు

మోంథా తుఫాను ధాటికి జిల్లాలో వరి, పత్తి, మినుము, కంది, సోయాబీన్‌ పంటలతో పాటు అరటి, కూరగాయలు, తమలపాకు, పూలు వంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టం జరిగితే పరిహారం అందజేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేసి, పంటల నష్టాన్ని గుర్తించారు. జిల్లాలో 3,800 మంది రైతులు పంట నష్టపరిహారం అందుకునేందుకు అర్హులుగా గుర్తించి, నివేదికను ప్రభుత్వానికి పంపారు. అయితే, రెండు నెలలు గడుస్తున్నా నేటి వరకు నష్టపరిహారం అందజేయకపోవడంతో బాధిత రైతులు మౌనంగా రోదిస్తూ, భారంగా ఎదురు చూస్తున్నారు.

రైతు కంట కన్నీరు

ఏటా ప్రకృతి వపరీత్యాలతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. అకాల వర్షాలు, తుఫానుల కారణంగా చేతికొచ్చిన పంటలు దెబ్బ తింటున్నాయి. మిగిలిన కొద్దిపాటి పంటలను విక్రయించుకునేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిహారం అందజేస్తే కొద్దిగా అయినా నష్టం భర్తీ అవుతుందనే భావనలో అన్నదాతలు ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలేవి తీసుకోకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోయిన సమయంలో కూడా ప్రభుత్వం ఆదుకోకపోతే పంటలు ఎలా సాగు చేయాలంటూ ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం నుంచి స్పందన కరువు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తానన్న రూ.20 వేల సాయాన్ని తొలి ఏడాది ఇవ్వలేదు. రెండో ఏడాది కూడా కౌలు రైతులకు అందజేయలేదు. ఖరీఫ్‌లో సరిపడా యూరియా సరఫరా చేయడంలోనూ ఘోరంగా విఫలమైంది. కూటమి సర్కారు వచ్చాక నష్టం తప్ప మేలు జరగలేదనే విమర్శలు రైతులు, రైతు సంఘాల నుంచి వస్తున్నాయి. ఇప్పటికై నా స్పందించి మోంథా తుపాను నష్టపరిహారం అందజేయాలని రైతులు, రైతు సంఘాలు కోరుతున్నారు.

నేను కౌలు రైతును. ఖరీఫ్‌లో ఎకరం మెట్ట, అయిదెకరాల మాగాణి సాగు చేశాను. ఎకరానికి 1400 చక్కెరకేళి మొక్కలు వేశాను. కౌలు రూ.55 వేలు. గెలలు అరకాయ దశలో ఉండగా మోంథా తుపానుకు వీచిన గాలులకు 1100 మొక్కలు పడిపోయాయి. చేతికి ఏమీ రాలేదు. రూ.1.50 లక్షల నష్టం వచ్చింది. అయిదెకరాల మాగాణిలో వరి వెదజల్లాను. ఎకరాకు రూ.34 వేల కౌలు చెల్లించాను. తుపాన్‌ కారణంగా పంట దిగుబడి బాగా తగ్గింది. ఎకరాకు రూ.15 వేలు నష్టం. పొలం యజమాని లెటరుతో కౌలు కార్డు తెచ్చుకున్నాను. ఈ–క్రాప్‌ నమోదు చేశారు. అయినా పంట నష్టపరిహారం ఏమీ లేదు. రైతుభరోసా డబ్బులు కూడా పడలేదు. గత ప్రభుత్వంలో పడ్డాయి. ఉచిత బీమాతో రైతులను ఆదుకున్నారు.

–కంకిపాటి శ్రీనివాసరాజు, గుదిబండివారిపాలెం

పైరు నష్టం(ఎకరాల్లో)

వరి 2,693.20

పత్తి 1,282.50

మినుము 1,243.55

సోయాబిన్‌ 234.61

కంది 10.02

అరటి 450.61

కూరగాయలు 123.27

తమలపాకు 24.43

పూలు 0.60

మోంథా తుపాను సాయంపై చంద్రబాబు మాటలు 1
1/2

మోంథా తుపాను సాయంపై చంద్రబాబు మాటలు

మోంథా తుపాను సాయంపై చంద్రబాబు మాటలు 2
2/2

మోంథా తుపాను సాయంపై చంద్రబాబు మాటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement