వైభవంగా బాల ఏసు ఉత్సవం
ఫిరంగిపురం: క్రీస్తు జన్మ దినోత్సవం సందర్భంగా స్థానిక బాల ఏసు దేవాలయం రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబైంది. ఆలయ ప్రాంగణంలోని అంథోని వారి మందిరం, చిన్న కొండపై గుహ, వ్యాకుల మాత స్వరూపం వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో శోభాయమానంగా వెలిగి పోతున్నాయి. దేవాలయం లోపల బాలఏసు జన్మించిన పశువుల పాక ఏర్పాటు చేశారు. భక్తులు కొవ్వొత్తులు పెట్టేందుకు, బయట కొబ్బరి కాయలు కొట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని కథోళిక క్రైస్తవుల ఇళ్ల వద్దకు మేళతాళాలతో సంఘ పెద్దలు, సోడాలిటీ సభ్యులు, గుడి పెద్దలు బాణసంచా, చిచ్చుబుడ్లు కాల్చి ప్రార్థనకు గుడి వద్దకు రమ్మని పిలుపు నిచ్చారు. దివ్య పూజాబలికి పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు భోజనం, వసతి కల్పించారు. అర్థరాత్రి నిర్వహించే దివ్య పూజాబలి పూజలకు మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య హాజరుకానున్నారు. గ్రామంలో పలు ప్రాంతాల్లో గల క్రీస్తు, మరియమాత మందిరాలు కూడా ముస్తాబయ్యాయి.
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్
తాడికొండ: తుళ్ళూరు మండలం వెంకటపాలెం గ్రామాలో గురువారం మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణ జరగనుంది. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకులు పాల్గొననున్న నేపథ్యంలో బుధవారం ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారీయా, సీఆర్డీఏ జాయింట్ కమిషనర్ భార్గవ్ తేజ, జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా వీవీఐపీ, వీఐపీ రాకపోకల మార్గాలు, సభా వేదిక, విగ్రహావిష్కరణ స్థలం, భారీ కేడింగ్, భద్రతా ఏర్పాట్లు, పోలీస్ పికెట్లు తదితర అంశాలను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వైభవంగా బాల ఏసు ఉత్సవం


