క్రాప్ హాలిడే ప్రకటిస్తేనే..
వచ్చే ఏడాది పొగాకు సాగు చెయ్యకుండా క్రాప్ హాలిడే ప్రకటిస్తేనే పొగాకు రైతులకు న్యాయం జరుగుతుంది. గత ఏడాది ధర బాగుంది కదా అని ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని నల్ల బర్లీ సాగు చేశాను. తీరా ఇప్పుడు చూస్తే అసలు కొనేవారే లేరు. ఒకవేళ ఎవరన్నా కొనేందుకు ముందుకు వచ్చినా బాగా ధర తగ్గించి అడుగుతున్నారు. అందుచేత వచ్చే ఏడాది క్రాప్ హాలిడే ప్రకటిస్తేనే మేలు జరుగుతుంది.
– కంచర్ల సాల్ బాబు, పొగాకు రైతు, తిమ్మాపురం
ధాన్యం కొనేవారే లేరు
నాకున్న అర ఎకరం సొంత పొలంతో పాటు 5 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరి పంట పండించాను. కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనేవారు కరువయ్యారు. ఇప్పటికీ ధాన్యం 300 బస్తాల వరకు నిల్వ ఉంది. గత ఏడాది ఖరీఫ్, ఈ ఏడాది ఖరీఫ్‌లో పండించిన ధాన్యం ప్రస్తుతం రూ. 2 వేల నుంచి రూ. 2400 ధర ఉండాల్సి ఉండగా, పాత ధాన్యాన్ని కూడా ఇప్పటికీ దళారులు రూ. 1400కే అడుగుతున్నారు. చివరి గింజ వరకు కొంటామని ప్రభుత్వం చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. గ్రామాల్లోకి అధికారులు వచ్చి సమావేశాలు నిర్వహించి, ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు కనిపించలేదు. ధాన్యం ధర ఈ విధంగా పతనమైన రోజులు గతంలో చూడలేదు.
– నాగిశెట్టి రమేష్, కౌలు రైతు, కసుకర్రు
క్రాప్ హాలిడే ప్రకటిస్తేనే..


