రాష్ట్రాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడమే పీ–4 లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడమే పీ–4 లక్ష్యం

Apr 14 2025 1:52 AM | Updated on Apr 14 2025 1:58 AM

మంగళగిరి: రాష్ట్రాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడమే పీ–4 లక్ష్యమని, దీనివల్ల పేదలకు ఒరిగేదేమీ ఉండదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ధ్వజమెత్తారు..చినకాకానిలో జరుగుతున్న జనసేవాదల్‌ శిక్షణా తరగుతులకు ఆదివారం ఆయన హాజరయ్యారు. చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ మతతత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. వక్ఫ్‌ బిల్లుకు మద్దతిచ్చిన చంద్రబాబుకు ముస్లింలు బుద్దిచెబుతారని హెచ్చరించారు. డిసెంబర్‌ 26న సీపీఐ శత జయంత్యుత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా రెడ్‌ షర్ట్‌ వలంటీర్లు సేవల కోసం దేశవ్యాప్తంగా జనసేవాదళ్‌ శిక్షణా తరగతులను ఏర్పాటు చేసినట్టు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జంగాల అజయ్‌కుమార్‌, చిన్నితిరుపతయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కంచర్ల కాశయ్య, జాలాది జాన్‌బాబు, అన్నవరపు ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు రాష్ట్రాన్ని

తాకట్టు పెడుతున్నారు

సీపీఐ జాతీయ కార్యదర్శి

నారాయణ ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement