వక్ఫ్ ఆధీనంలోకి మస్తాన్ దర్గా..?
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): నగరంపాలెంలోని హజ్రత్ కాలేషా మస్తాన్ దర్గా ఇప్పుడు వక్ఫ్ ఆదీనంలోకి వెళ్ళనున్నట్టు సమాచారం. వక్ఫ్ కమిటీ ఆదేశాల మేరకు దీనిని స్వాధీనం చేసుకునేందుకు శుక్రవారం జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ ముక్తార్ బాషా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్ ఖుదూస్, సూపరిటెండెంట్ హుస్సెన్ ఇబ్రహిం బేగ్ పోలీసులతో వచ్చారు. దర్గా వ్యవహారాలను ఎప్పటి నుంచో రావి రామోహన్‌రావు అలియాస్ దర్గా రాము, అతని కుటుంబ సభ్యులు చూస్తున్నారు. దర్గాకు వచ్చే కానుకల్లో నిబంధనల మేరకు ఏడు శాతం వక్ఫ్ బోర్డుకు చెల్లించాలి. అయితే సక్రమంగా దర్గా రాము చెల్లించడం లేదు. రూ.9 లక్షలకు పైగా ఇంకా బకాయి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డు కమిటీ చైర్మన్ ఉత్తర్వుల మేరకు దర్గా ముతవల్లిగా ఉన్న రామును పదిరోజులపాటు అధికారులు సస్పెండ్ చేశారు. దర్గాను స్వాధీనం చేసుకునేందుకు వచ్చారు. రాము అందుబాటులో లేకపోవడంతో ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సోమవారం వరకు గడువు ఇవ్వాలని రాము కోరడంతో వక్ఫ్ అలధికారులు గడువు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రాముకు వక్ఫ్‌బోర్డు కమిటీ సభ్యుడిగా వ్యవహరించే ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అండదండలు ఉండటంతో దర్గాను ఆధీనంలోకి తీసుకునేందుకు వక్ఫ్ అధికారులకు అడ్డంకిగా మారినట్టు సమాచారం. అయితే రాముపై, అతని కుమారుడిపై ఇటీవల వెల్లువెత్తిన వివాదాల నేపథ్యంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, వక్ఫ్‌బోర్డు సభ్యుడు నసీర్ అహ్మద్ కూడా దర్గాను ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులకు హుకుం జారీ చేసినట్టు తెలుస్తోంది.
స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన వక్ఫ్ అధికారులు దర్గా రాముతో ఫోన్‌లో సంప్రదింపులు సోమవారం వరకు గడువు


