వార ఫలాలు (30 ఆగస్టు నుంచి 5 సెప్టెంబర్‌ 2020 వరకు)

Weekly Horoscope From August 30th To September 5th - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. మీ ఊహలు కొన్ని నిజం కాగలవు. నిరుద్యోగుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ప్రత్యర్థులు సైతం మీపై ప్రేమ చూపిస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు విధుల్లో అవాంతరాలు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఏ పని చేపట్టినా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కొంతకాలంగా రావలసిన సొమ్ము అంది ఆశ్చర్యపరుస్తుంది. అవసరాలకు ఏ మాత్రం లోటురాదు. వాహనాలు, భూములు కొంటారు. పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. నేరేడు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. శ్రమపడ్డా ఫలితం కనిపించని స్థితి. కొన్ని నిర్ణయాలు చివరిలో మార్చుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. కొన్ని వేడుకలు రద్దు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు ముందుకు సాగక ఇబ్బందిపడతారు. ఉద్యోగాలలో అదనపు బా«ధ్యతలు మోయాల్సిన పరిస్థితి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒడిదుడుకులు తప్పవు. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు.  విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలలో కొంత అనుకూల పరిస్థితులు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. పారిశ్రామికవర్గాలకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వారం ప్రారంభంలో స్వల్ప ధనలబ్ధి. తెలుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
మీలోని నైపుణ్యం మరింత వెలుగులోకి వస్తుంది. ఆలోచనలు అమలులో ప్రతిబంధకాలు తొలగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. ప్రముఖులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఆస్తుల వివాదాలు పరిష్కారానికి చేరువగా ఉంటాయి. గృహం, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు సఫలమయ్యే సమయం. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకోని కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొన్ని వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడవచ్చు. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశ్చర్యకరంగా ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. కళారంగం వారి యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. బంధువులతో వివాదాలు. తెలుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. శ్రమపడతారు, అయితే ఫలితం కనిపించని స్థితి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఆస్తుల వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు సామాన్యలాభాలతో నడుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడతాయి. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. వారం చివరిలో శుభవార్తా శ్రవణం. ధన, వస్తులాభాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు నెలకొనవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆస్తి ఒప్పందాలు కొన్ని మార్చుకుంటారు. స్వల్ప అనారోగ్య సూచనలు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కొంత నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు జరిగే సూచనలు. రాజకీయవర్గాలకు కొద్దిపాటి చికాకులు నెలకొంటాయి. వారం ప్రారంభంలో కొత్త వ్యక్తుల పరిచయం. ఆసక్తికర సమాచారం రాగలదు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. గులాబి, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
రుణభారాలు పెరిగి సతమతమవుతారు. శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పరిస్థితులు అంతగా అనుకూలించక నిర్ణయాలు కొన్ని మార్పుకుంటారు. సన్నిíß తుల సలహాల కోసం యత్నిస్తారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి, లాభాలు స్వల్పమే. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారికి అవకాశాలు చేజారవచ్చు. వారం మధ్యలో ధనలాభం. కార్యసిద్ధి. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
నూతన వ్యక్తుల పరిచయం. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఒక మరపురాని సంఘటన ఎదురవుతుంది. మీపై కుటుంబంలో ఆదరణ మరింత పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. ఆరోగ్యభంగం. నీలం, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
వ్యవహారాలలో అవాంతరాలు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. సోదరులతో వివాదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయటా వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. చిన్ననాటి మిత్రులు కలుసుకుంటారు. వ్యాపారాలు ఎంత కష్టించినా లాభాలు కనిపించని స్థితి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. నేరేడు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే అనుకూలిస్తాయి. మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. భూవివాదాలు క్రమేపీ కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణాలకు ప్రణాళిక రూపొందిస్తారు. కుటుంబసభ్యులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొని ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం మధ్యలో చికాకులు. ఆరోగ్యభంగం. ధనవ్యయం. గులాబి, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top