వైఎస్సార్సీపీ నాయకుల సహాయంతో ఇండియాకు తిరిగొచ్చిన పద్మావతి

Ysrcp Leaders Help Padmavathi To Send Back To India From Kuwait - Sakshi

తూర్పు గోదావరికి చెందిన మూరి పద్మావతి(64) దీనగాధ ఇది.. 20 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ఆమె కువైట్‌కు వెళ్లింది. అయితే ఓ కంపెనీ చేసిన ఫ్రాడ్‌వీసా కారణంగా ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కువైట్‌లో బట్టలు అమ్మి జీవనం సాగించేది. కరోనా సమయంలో అనారోగ్యానికి గురై,రెసిడెన్సీ కూడా లేని కారణంగా ఆసుపత్రికి కూడా పోలేని పరిస్ధితిలో బంధువులు ఎవరూ లేక చాలా ఇబ్బందులు పడింది.

అదే సమయంలో బొంబాయికి చెందిన మహమ్మద్ యూనుస్  అనే యువకుడు  అన్నీ తానై సొంత తల్లిలా చూసుకున్నాడు. పద్మావతి విషయం వైఎస్సార్సీపీ కువైట్ సీనియర్ నాయకులు ఆకుమూర్తి లాజరస్.. APNRTS డైరెక్టర్ ఇలియాస్ బి.హెచ్. కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, APNRTS రీజినల్ కో ఆర్డినేటర్ నాయని మహేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఎంబసీ అధికారుల సహాయంతో భారత్‌కు పంపించారు.

ఈ సందర్భంగా ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఇన్నేళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని, ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. 
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top