మంచి లగ్జరీయస్ ఉద్యోగంలో స్థిరపడి బిందాస్‌గా లైప్‌ని లీడ్ చేస్తున్నాడు. అయినా ఎందుకో ఒకరికింద పనిచేయడం రుచించలేదు. తనే వ్యవస్థాపకుడిగా ఎందుకు మారకూడదనుకున్నాడు. అలా అని అనాలోచితంగా నిర్ణయం తీసుకోవాలని కూడా అనుకోలేదు. ఏం వ్యాపారం బెటర్, దానికి మార్కెట్ ఉంటుందా..తదితరాలన్ని బేరీజు వేసుకుని..రాజీపడకుండా పెట్టబడులు పెట్టి.. కోట్లు గడించే రేంజ్‌కు చేరుకున్నాడు. ఆ క్రమంలో ఎన్నో కష్టాలు, ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాక గానీ కోట్లు కొలగొట్టే స్థాయికి చేరుకోలేదు. మరి అతడి ప్రస్థానం ఎలా మొదలైందో సవివరంగా తెలుసుకుందామా..!.
అతడే ముంబైకి చెందిన యశ్వంత్ నాగ్ మోచర్ల. అతడు 2012లో భువనేశ్వర్‌లో జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసి, టీసీఎస్‌లో బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఆసమయంలోనే ఆహారానికి సంబంధించిన రిటైల్ వ్యాపారాల గురించి తెలుసుకుంటుండేవాడు. అయితే నాగ్ 2011లో యూరప్‌కి చేసిన బ్యాక్‌ప్యాకింగ్ యాత్రలో మిల్క్‌షేక్ వ్యాపార ఆలోచన వచ్చింది. అయితే కార్యరూపం దాల్చడానికి చాలా సమయం తీసుకున్నాడు. బెల్జియం ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి దగ్గరగా ఉన్నప్పుడూ అందరూ ఇష్టంగా ఆస్వాదించే మిల్క్ షేక్‌లు భారత్‌లో కూడా ప్రజలు ఇష్టపడతారా అన్న ఆలోచన తళుక్కుమంది యశ్వంత్ మనసులో.
అయితే అది వెంటనే వ్యాపారంగా కార్యరూపంలోకి రాలేదు. తొలుత తన కార్పొరేట్ ఉద్యోగాన్ని కొనసాగిస్తూ..తన చుట్టూ ఉన్న వినియోగదారుల వ్యాపారాలను అధ్యయనం చేయడం ప్రారంభించారు. ముంబైలో పనిచేస్తున్నప్పుడే ఆహార, రిటైల్ వ్యాపారాలు ఎలా నిర్మించబడ్డాయో గమనించి భారతదేశ వ్యవస్థీకృత పానీయాల మార్కెట్‌లో ఉన్న లోటు పాటుల గురించి క్షణ్ణంగా తెలుసుకున్నారు. మిల్క్‌షేక్‌లు ప్రతిచోటా అందుబాటులో ఉండేవి, కానీ వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించే బ్రాండ్ ఏదీ లేదు అని గుర్తించి దాన్నే స్పెషల్‌గా అందురు మెచ్చే ఒక బ్రాండెడ్ మిల్క్‌షేక్ తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. మెక్‌డొనాల్డ్, డొమినెస్ వంటి పెద్ద ఫుడ్ చైన్‌ల మంచి గుర్తింపు రావాలని భావించాడు.
ఆ నేపథ్యంలోనే 2013లో తన ఉద్యోగానికి రిజైన్ చేసి తన సోదరుడు అశ్విన్ మోచర్లతో కలిసి హైదరాబాద్‌లో 'ది థిక్‌షేక్ ఫ్యాక్టరీ'ని ప్రారంభించారు. అశ్విన్ జేఎన్‌టీయూ హైదరాబాద్ నుంచి బీటెక్, గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎంబీఏ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి. తన ఇంజనీరింగ్ అండ్ మేనేమెంట్ నేపథ్యాన్ని ఈ సంస్థ అందించారు. అంతేగాదు సంస్థాగత ఈక్విటీ నిధులపై ఆధారపడకుండా తమ సొంత నిధులతోనే వ్యాపారాన్ని ప్రారంభించారు. తమ సొంత ఐస్‌క్రీమ్ బేస్‌ని అభివృద్ధి చేసి, దానని ఒక బ్రాండ్‌గా తీసుకురావాలనుకున్నారు.
అంటే తమ బ్రాండ్ అని అనిపించేలా సరికొత్త ఐస్‌క్రీం రెసిపీని సృష్టించుకున్నారు. అలా అక్టోబర్ 2016లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ప్రారంభించారు. ఆ తర్వాత ఈ కంపెనీ హైదరాబాద్ దాటి బెంగళూరు, ముంబై వంటి మార్కెట్లకు విస్తరించింది. ఆ తర్వాత 2018 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించే యోచనకు సిద్ధమవుతుండగా కరోనా మహమ్మారి దెబ్బకొట్టింది. ఒక్కసారిగా నష్టాలు చుట్టుముట్టడం మొదలయ్యాయి. దాంతో ఆహర్నిశలు శ్రమించి మళ్లీ ఇదివరకిటిలా ఊపందుకునేలా కృషి చేశారు.
అలా 2022లో రూ. 12 కోట్లు నికర లాభం అందుకుంది. అలా లాభాలబాట పట్టడం మొదలై..2024 కల్లా ఈ కంపెనీ ఆధాయం రూ. 21.18 కోట్లు టర్నోవర్ అందుకుంది. గతేడాదితో పోలిస్తే రూ. 3 కోట్లు అదనం. అలా వ్యాపారం మంచి ఊపందుకోవడమే గాక తమ బిజినెస్ విస్తరించే పనిలో కూడా నిమగ్నమయ్యారు. ప్రస్తుతం థిక్‌షేక్ ఫ్యాక్టరీ వ్యాపారం 15 నగరాలకు విస్తరించడమే కాకుండా రెండు దేశాలలో సుమారు 85కి పైగా అవుట్‌లెట్‌లకు విస్తరించి..20 కోట్లు టర్నోవర్ చేసే లభదాయక వ్యాపారంగా మారింది.
ఇదీ చదవండి: ఆ తల్లి.. రియల్ వారియర్! కంటతడి పెట్టించే దృశ్యం..)


