‘నాకీ ఉద్యోగం కావాలి సర్‌.. లేదంటే నా లవర్‌ను పెళ్లి చేసుకోలేను’ వైరల్‌ స్టోరీ | Would Never Marry Childhood Love If Rejected Man Applies For Job and mentions | Sakshi
Sakshi News home page

‘నాకీ ఉద్యోగం కావాలి సర్‌.. లేదంటే నా లవర్‌ను పెళ్లి చేసుకోలేను’ వైరల్‌ స్టోరీ

Published Sat, Jun 15 2024 4:16 PM | Last Updated on Sat, Jun 15 2024 4:46 PM

 Would Never Marry Childhood Love If Rejected Man  Applies For Job and mentions

చదువు పూర్తయిన తరువాత ఉద్యోగాల వేటలో పడటం, ఉద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం ఇదంతా తెలిసిందే.   ఎలాగోలా కష్టపడి ఉద్యోగం సంపాదించడానికి  రక రకాల ప్రయత్నాలు చేయడమూ కొత్తేమీ కాదు. కానీ ఒక యువకుడు ఉద్యోగం కోసం వెరైటీగా దరఖాస్తు  చేసుకున్నాడు.  దీంతో  ఇది వార్తల్లో నిలిచింది.

విషయం ఏమిటంటే.. ఉద్యోగ య‌త్నాల్లో భాగంగా రెజ్యూమేను శ్రద్ధగా తయారు చేసుకుంటాం. ఇందులో  మ‌న‌కు సంబంధించిన అన్ని నైపుణ్యాల‌ను పొందు పరుస్తాం. అలా ఉద్యోగం ఇచ్చే వ్యక్తులను, సంస్థలను ఇంప్రెస్‌ చేయడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాం.  కానీ ఈ స్టోరీలోని వ్య‌క్తి  మాత్రం రెజ్యూమ్‌లో తాను సంబంధిత ఉద్యోగానికి  ఎలా అర్హుడినో చెబుతూనే... త‌న ప్రేమ సంగతిని కూడా చెప్పుకొచ్చాడు.  తనకీ ఉద్యోగం రాకపోతే తన చిన్నప్పటిని స్నేహితురాల్ని పెళ్లి చేసుకోలేను అంటూ మొరపెట్టుకున్నాడు.  ఈ ఉద్యోగానికి మీరు అర్హులు అని ఎందుకు అనుకుంటున్నారు? అనే ప్ర‌శ్నకు సమాధానంగా ‘‘నాకు ఈ పొజిష‌న్‌కి కావాల్సిన అన్ని నైపుణ్య‌లు నాకు ఉన్నాయి. నేను దీనికి 100 శాతం ప‌ర్ఫెక్ట్ అని  అనిపిస్తోంది’’ అని రాశాడు. అలాగే ‘‘ఈ ఉద్యోగం నాకు రాక‌పోతే నేను నా చిన్న‌నాటి స్నేహితురాల‌ని పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే వాళ్ల నాన్న నాకు ఉద్యోగం లేక‌పోతే త‌న కూతురిని ఇచ్చి పెళ్లి చేయ‌ను అంటున్నాడు’’ అని  రాసుకొచ్చాడు.  

అర్వా హెల్త్ ఫౌండర్‌,  సీఈవో డిపాలీ బజాజ్ ఇటీవల ఒక అభ్యర్థి  ఉద్యోగ దరఖాస్తు స్క్రీన్‌షాట్‌ను ఎక్స్‌లో షేర్‌ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ‘ఫైరింగ్‌ కెన్‌ మీ ఫన్‌ టూ’ అనే క్యాప్షన్‌తో ఆమె దీన్ని ట్వీట్‌ చేశారు. దీంతో నెటిజన్లు కొంతమంది అతని పట్ల సానుకూలంగా స్పందించడం విశేషం. ‘వారిద్దరి జీవితాలు ఈ జాబ్‌పైనే ఆధారపడి ఉన్నాయి’ అని ఒకరు ఫన్నీగా కామెంట్‌ చేశారు. అతని నిజాయితీని గర్తించైనా అతనికి ఉద్యోగం ఇవ్వాలంటూ మరొకరు కమెంట్‌ చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement