ఇదే అతి పె..ద్ద.. గోల్డ్‌ మైనింగ్‌! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట..

Worlds Largest Gold Mine Amazing Facts About US Nevada Gold Mine - Sakshi

బంగారానికి పసిడి, సువర్ణం, సురభి, కాంచనం, హిరణ్యం.. వంటి అనేక పేర్లున్నాయి. ఏ పేరుతో పిలిచినా పుత్తడి లోహం మాత్రం చాలా విలువైనది. అంత విలువైన బంగారంతో తయారుచేసిన కనకాభరణాలంటే మోజు పడనివారంటూ ఉండరేమో! బంగారం ఆకర్షణీయంగా ఉండటమేకాకుండా విలువకూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇక మనదేశంలో ఐతే బంగారాన్నిఏకంగా ఆస్తిగా భావిస్తారు. ఇంత విలువైన బంగారం గనుల నుంచి లభ్యమౌతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఐతే ప్రపంచంలోనే అత్యధికం బంగారం ఏక్కడ లభ్యమౌతుంది? అక్కడ ఎంత బంగారం వెలికితీస్తున్నారో? దాని విలువ ఎంతుంటుందో?.. ఎప్పుడైనా ఆలోచించారా! ఆ విశేషాలు మీ కోసం..

అతిపెద్ద గోల్డ్‌ మైన్‌.. ప్రపంచదేశాలకు ఎగుమతి..
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గనుల నుంచి బంగారం లభ్యమవుతున్నా.. అత్యధిక బంగారాన్ని మాత్రం నెవాడా బంగారం గని నుంచే లభ్యమవుతుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్‌ మైన్‌. అమెరికాలోని నెవాడా సిటీలో ఈ బంగారం గని ఉంది. ఈ బంగారం గని సంవత్సరానికి లక్షల కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇక్కడి నుంచి బంగారం ఎగుమతి అవుతుంది. అంటే ఈ బంగారం గని ద్వారా ఏటా ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుందో అంచనా వేయండి.

చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి..

ఇప్పటివరకు ఎంత బంగారం తవ్వారంటే..
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ఆధారంగా ‘స్టాటిస్టా’ రూపొందించిన జాబితా ప్రకారం నెవాడా బంగారం గని నుంచి ప్రతీ ఏట 1 లక్ష 70 వేల కిలోల వరకు బంగారం తవ్వబడుతుంది. దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయల విలువైన బంగారం ఎగుమతి అవుతుందట. 1835 నుండి 2017 వరకు నెవాడా దాదాపుగా 20,59,31,000 ట్రాయ్ ఔన్సుల బంగారాన్ని ఉత్పత్తి చేసిందని ఆ నివేదిక వెల్లడించింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..  మొత్తం ప్రపంచ జనాభాలో 5 శాతం ఇక్కడే ఉన్నారని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఏదిఏమైనా పసుపు రంగులో మెరిసిపోయే బంగారం చూడటానికే కాదు... దాని విశేషాలు వినడానికి కూడా చాలా గమ్మత్తుగా ఉ‍న్నాయి కదా!! 

చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్‌ ఐలాండ్‌.. లక్షల కోట్ల సంపద!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top