World Oceans Day: సముద్ర సంరక్షణలో...Divya Hegde and Rabia Tewari | World Oceans Day: Ocean Activists divya hegde and Rabia Tiwari fighting ocean pollution | Sakshi
Sakshi News home page

World Oceans Day: సముద్ర సంరక్షణలో...Divya Hegde and Rabia Tewari

Jun 8 2024 6:29 AM | Updated on Jun 8 2024 6:29 AM

World Oceans Day: Ocean Activists divya hegde and Rabia Tiwari fighting ocean pollution

సముద్రమంత గాంభీర్యం అంటారు. సముద్రమంత  సాహసం అంటారు. సముద్రమంత  సహనం అంటారు. అయితే ఇప్పుడు ‘గాంభీర్యం’ ‘సాహసం’ 
‘సహనం’ స్థానంలో ‘ప్రమాదం’ కనిపిస్తోంది. కాలుష్యం బారిన పడి తల్లడిల్లుతున్న సముద్రం గుండె చప్పుడు విన్న వాళ్లు బాధ పడుతూ కూర్చోవడం లేదు. సముద్ర కాలుష్యాన్ని నివారించే  కార్యక్రమాల్లో భాగం అవుతున్నారు. ‘వరల్డ్‌ ఓషన్స్‌ డే’ సందర్భంగా ఓషన్‌ యాక్టివిస్ట్‌లు దివ్య హెగ్డే, రబియా తివారీ గురించి...

గూగుల్‌ మాజీ ఉగ్యోగి అయిన దివ్యా హెగ్డే కర్నాటక కోస్తాప్రాంతాలలో సముద్ర కాలుష్యం, నివారణ మార్గాల గురించి ప్రచారం చేస్తోంది.  క్లైమెట్‌ యాక్టివిస్ట్, సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తింపు పొందిన దివ్య వివిధ కళారూపాల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది.

ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాలను సముద్రంలోపారవేయకుండా నిరోధించడానికి యక్షగాన ప్రదర్శనల ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ యక్షగాన ప్రదర్శనలో ప్లాస్టిక్‌’ ను రాక్షసుడిగా చూపించారు. ఆ రాక్షసుడిని మట్టికరిపించే శక్తి మానవుడిలో ఉంది అనే సందేశాన్ని ఇచ్చారు.ఈ యక్షగానంలో తడి చెత్త, ΄÷డి వ్యర్థాలపాత్రలను కళాకారులు ΄ోషించారు.

సముద్రంపై ప్లాస్టిక్‌ హానికరమైన ప్రభావాన్ని చూపించేలా ప్లాస్టిక్‌ అసుర పాత్రను రూపొందించారు.
‘కర్ణాటకలో యక్షగానానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ బలమైన కళారూపం ద్వారా ΄్లాస్టిక్‌ కాలుష్యాన్ని  ఎదుర్కోవడం నుంచి తడి, ΄÷డి చెత్తను వేరు చేయడం వరకు ఎన్నో విషయాలు చెబుతున్నాం. ఈ ప్రచారాల ద్వారా ప్రజలకు మంచి విషయాలను చేరువ చేయడం ఒక కోణం అయితే కళాకారులకు ఆర్థికపరంగా సహాయపడడం మరో కోణం’ అంటుంది దివ్య.

‘బేరు’ అనే స్వచ్ఛందసంస్థ ద్వారా తీర్రపాంత వ్యర్థాల నిర్వహణపై పనిచేస్తోంది దివ్య.
వ్యర్థాలను ప్రాసెస్‌ చేయడం గురించి మహిళలకు శిక్షణ ఇచ్చారు. వీరు ఇంటింటికి వెళ్లి ΄్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరిస్తారు. సముద్ర వ్యర్థాలను తగ్గించే విధానాలలో ఇది ఒకటి. తడి చెత్తప్రాసెసింగ్‌ ద్వారా వచ్చే సేంద్రియ ఎరువులను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు.

వ్యర్థాలను సేకరించడం,ప్రాసెస్‌ చేయడం ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారు.
మత్స్యకారుల కుటుంబాలలో డిజిటల్‌ నైపుణ్యాలు పెంచడంపై కూడా ‘బేరు’ దృష్టి పెట్దింది.
దీనిలో భాగంగా యూజర్‌–ఫ్రెండ్లీ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యాప్‌ను రూపొందించారు. ‘డోర్‌–టు–డోర్‌ వేస్ట్‌ కలెక్షన్‌’ కార్యక్రమాలలో మహిళలకు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.

ముంబైకి చెందిన రబియా తివారీ తన భర్త ఇంద్రనీల్‌ సేన్‌గు΄్తాతో కలిసి  సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది. ముంబైలో సముద్రతీర అపార్ట్‌మెంట్‌కు మారినప్పుడు బీచ్‌లో టన్నుల కొద్ది చెత్తను చూసి చలించి΄ోయారు ఈ దంపతులు. ఆ బాధలో నుంచే ‘ఎథికో ఇండియా’ అనే సామాజిక సంస్థను మొదలుపెట్టారు.

ఇద్దరు వ్యక్తులతో మొదలైన ‘ఎథికో ఇండియా’ ఆ తరువాత ‘సిటిజెన్‌ మూవ్‌మెంట్‌’ స్థాయికి చేరుకుంది.
ఉద్యమం ఊపందుకోవడంతో వాలంటీర్లు మాహిమ్‌ బీచ్‌ నుంచి కిలోల కొద్దీ ΄ోగుపడిన సముద్ర వ్యర్థాలను తొలగించారు.
సోషల్‌ మీడియా వేదికగా ఎంతోమందిని ఉద్యమంలో భాగం చేసింది ‘ఎథికో ఇండియా’.

‘మాహిమ్‌ బీచ్‌ క్లిన్‌ అప్‌ డ్రైవ్‌’ను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ ఉద్యమం మరికొన్ని ఉద్యమాలకు ద్వారాలు  తెరిచింది. ‘ఓపెన్‌ ఫెస్ట్‌’ అనేది అందులో ఒకటి. కళల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడటమే దీని లక్ష్యం.
‘ఓపెన్‌ ఫెస్ట్‌’లో అంకుర్‌ తివారీ, మానసీ పరేఖ్, అనురాగ్‌ శంకర్, చందన బాల కళ్యాణ్, సుమిత్‌ నాగ్‌దేవ్‌లాంటి ప్రముఖ కళాకారులు భాగం అయ్యారు.
‘మా ప్రయత్నం ఫలించినందుకు సంతోషం గా ఉంది. అధికారులలో మార్పు వచ్చింది. ప్రక్షాళన  కార్యక్రమాల్లో మాతో కలిసి చురుగ్గాపాల్గొంటున్నారు’ అంటుంది రబియా తివారీ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement