మిస్‌ గ్రాండ్‌ ఏపీ–2026గా డా.దివ్య | Dr Divya crowned Miss Grand AP 2026 | Sakshi
Sakshi News home page

మిస్‌ గ్రాండ్‌ ఏపీ–2026గా డా.దివ్య

Feb 14 2026 4:46 AM | Updated on Feb 14 2026 4:46 AM

Dr Divya crowned Miss Grand AP 2026

బీచ్‌రోడ్డు (విశాఖ): హైదరాబాద్‌లో ఇ­టీ­వల నిర్వహించి­న మిస్‌ గ్రాండ్‌ ఆంధ్రప్రదేశ్‌ పోటీల్లో డాక్టర్‌ దివ్య వార­ణాసి విజేతగా నిలి­చినట్లు మిస్‌ గ్రాండ్‌ ఏపీ–తెలంగాణ డైరెక్టర్, ఇలాహే మోడలింగ్‌–ఫినిషింగ్‌ స్కూల్‌ స్థాపకురాలు భారతి బెర్రి ప్రకటించారు. వైద్యురాలైన దివ్య, మోడలింగ్‌పై ఉన్న మక్కువతో శిక్షణ పొంది, 100 మందికి పైగా పోటీదారులు పాల్గొన్న గ్రాండ్‌ ఫినాలేలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. 

మిస్‌ గ్రాండ్‌ ఇండియా–2025 విజేత విశాఖ కన్వర్‌ సమక్షంలో దివ్య ఈ కిరీటాన్ని అందుకున్నారు. ఏప్రిల్‌లో జరగనున్న మిస్‌ గ్రాండ్‌ ఇండియా జాతీయ స్థాయి పోటీల్లో దివ్య ఏపీ ప్రతినిధిగా పాల్గొననున్నారు. ఈ వేదిక ద్వారా మహిళల ఆరోగ్య అవగాహన, సాధికారతపై తాను దృష్టి సారించనున్నట్లు డాక్టర్‌ దివ్య పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement