breaking news
ocean pollution
-
World Oceans Day: సముద్ర సంరక్షణలో...Divya Hegde and Rabia Tewari
సముద్రమంత గాంభీర్యం అంటారు. సముద్రమంత సాహసం అంటారు. సముద్రమంత సహనం అంటారు. అయితే ఇప్పుడు ‘గాంభీర్యం’ ‘సాహసం’ ‘సహనం’ స్థానంలో ‘ప్రమాదం’ కనిపిస్తోంది. కాలుష్యం బారిన పడి తల్లడిల్లుతున్న సముద్రం గుండె చప్పుడు విన్న వాళ్లు బాధ పడుతూ కూర్చోవడం లేదు. సముద్ర కాలుష్యాన్ని నివారించే కార్యక్రమాల్లో భాగం అవుతున్నారు. ‘వరల్డ్ ఓషన్స్ డే’ సందర్భంగా ఓషన్ యాక్టివిస్ట్‌లు దివ్య హెగ్డే, రబియా తివారీ గురించి...గూగుల్ మాజీ ఉగ్యోగి అయిన దివ్యా హెగ్డే కర్నాటక కోస్తాప్రాంతాలలో సముద్ర కాలుష్యం, నివారణ మార్గాల గురించి ప్రచారం చేస్తోంది. క్లైమెట్ యాక్టివిస్ట్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తింపు పొందిన దివ్య వివిధ కళారూపాల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది.ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను సముద్రంలోపారవేయకుండా నిరోధించడానికి యక్షగాన ప్రదర్శనల ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ యక్షగాన ప్రదర్శనలో ప్లాస్టిక్’ ను రాక్షసుడిగా చూపించారు. ఆ రాక్షసుడిని మట్టికరిపించే శక్తి మానవుడిలో ఉంది అనే సందేశాన్ని ఇచ్చారు.ఈ యక్షగానంలో తడి చెత్త, ΄÷డి వ్యర్థాలపాత్రలను కళాకారులు ΄ోషించారు.సముద్రంపై ప్లాస్టిక్ హానికరమైన ప్రభావాన్ని చూపించేలా ప్లాస్టిక్ అసుర పాత్రను రూపొందించారు.‘కర్ణాటకలో యక్షగానానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ బలమైన కళారూపం ద్వారా ΄్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడం నుంచి తడి, ΄÷డి చెత్తను వేరు చేయడం వరకు ఎన్నో విషయాలు చెబుతున్నాం. ఈ ప్రచారాల ద్వారా ప్రజలకు మంచి విషయాలను చేరువ చేయడం ఒక కోణం అయితే కళాకారులకు ఆర్థికపరంగా సహాయపడడం మరో కోణం’ అంటుంది దివ్య.‘బేరు’ అనే స్వచ్ఛందసంస్థ ద్వారా తీర్రపాంత వ్యర్థాల నిర్వహణపై పనిచేస్తోంది దివ్య.వ్యర్థాలను ప్రాసెస్ చేయడం గురించి మహిళలకు శిక్షణ ఇచ్చారు. వీరు ఇంటింటికి వెళ్లి ΄్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు. సముద్ర వ్యర్థాలను తగ్గించే విధానాలలో ఇది ఒకటి. తడి చెత్తప్రాసెసింగ్ ద్వారా వచ్చే సేంద్రియ ఎరువులను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు.వ్యర్థాలను సేకరించడం,ప్రాసెస్ చేయడం ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారు.మత్స్యకారుల కుటుంబాలలో డిజిటల్ నైపుణ్యాలు పెంచడంపై కూడా ‘బేరు’ దృష్టి పెట్దింది.దీనిలో భాగంగా యూజర్–ఫ్రెండ్లీ వేస్ట్ మేనేజ్మెంట్ యాప్‌ను రూపొందించారు. ‘డోర్–టు–డోర్ వేస్ట్ కలెక్షన్’ కార్యక్రమాలలో మహిళలకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.ముంబైకి చెందిన రబియా తివారీ తన భర్త ఇంద్రనీల్ సేన్గు΄్తాతో కలిసి సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది. ముంబైలో సముద్రతీర అపార్ట్‌మెంట్‌కు మారినప్పుడు బీచ్‌లో టన్నుల కొద్ది చెత్తను చూసి చలించి΄ోయారు ఈ దంపతులు. ఆ బాధలో నుంచే ‘ఎథికో ఇండియా’ అనే సామాజిక సంస్థను మొదలుపెట్టారు.ఇద్దరు వ్యక్తులతో మొదలైన ‘ఎథికో ఇండియా’ ఆ తరువాత ‘సిటిజెన్ మూవ్మెంట్’ స్థాయికి చేరుకుంది.ఉద్యమం ఊపందుకోవడంతో వాలంటీర్లు మాహిమ్ బీచ్ నుంచి కిలోల కొద్దీ ΄ోగుపడిన సముద్ర వ్యర్థాలను తొలగించారు.సోషల్ మీడియా వేదికగా ఎంతోమందిని ఉద్యమంలో భాగం చేసింది ‘ఎథికో ఇండియా’.‘మాహిమ్ బీచ్ క్లిన్ అప్ డ్రైవ్’ను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ ఉద్యమం మరికొన్ని ఉద్యమాలకు ద్వారాలు తెరిచింది. ‘ఓపెన్ ఫెస్ట్’ అనేది అందులో ఒకటి. కళల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడటమే దీని లక్ష్యం.‘ఓపెన్ ఫెస్ట్’లో అంకుర్ తివారీ, మానసీ పరేఖ్, అనురాగ్ శంకర్, చందన బాల కళ్యాణ్, సుమిత్ నాగ్దేవ్లాంటి ప్రముఖ కళాకారులు భాగం అయ్యారు.‘మా ప్రయత్నం ఫలించినందుకు సంతోషం గా ఉంది. అధికారులలో మార్పు వచ్చింది. ప్రక్షాళన కార్యక్రమాల్లో మాతో కలిసి చురుగ్గాపాల్గొంటున్నారు’ అంటుంది రబియా తివారీ. -
ఈ 'రోబో చేప'తో సముద్రాలు క్లీన్.. ప్లాస్టిక్‌ను తినేస్తుందటా!
బీజింగ్: సముద్రాల్లో మాటువేసిన ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ దేశాలకు ఇప్పుడొక పెద్ద సమస్యగా మారిపోయింది. భూమిపై అన్ని సముద్రాల్లో 19.90 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు నిపుణుల అంచనా. వీటిని తొలగించి, మహాసాగరాలను పరిశుభ్రంగా మార్చడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. సముద్రాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు చైనా శాస్త్రవేత్తలు. మెక్రోప్లాస్టిక్‌ను తినే రోబో చేపను తయారు చేశారు. ప్రపంచంలోని కలుషితమైన సముద్రాలను శుభ్రపరిచేందుకు ఏదో ఒకరోజు తమ రోబో ఉపయోగపడుతుందని నైరుతి చైనాలోని సిచువాన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. స్పర్శకు మృదువుగా, కేవలం 1.3 సెంటీమీటర్లు (0.5 అంగుళాలు) పరిమాణంలోని ఈ రోబోలు ఇప్పటికే తక్కువ లోతైన నీటిలోని మైక్రోప్లాస్టిక్‌లను పీల్చుకుంటున్నట్లు తేలింది. అయితే.. అత్యంత లోతైన నీటిలోని మెక్రోప్లాస్టిక్‌ను సేకరించటమే లక్ష్యంగా పరిశోధకుల బృందం కృషి చేస్తోంది. అంతే కాదు ఈ రోబోల ద్వారా ఎప్పటికప్పుడు సముద్రాల కాలుష్యంపై వివరాలు తెలుసుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు వాంగ్ యుయాన్ అనే శాస్త్రవేత్త. 'మేము అత్యంత తేలికపాటి సూక్ష్మీకరించిన రోబోట్‌ను తయారు చేశాం. దీనిని చాలా విధాలుగా ఉపయోగించవచ్చు. బయోమెడికల్, ప్రమాదక పనుల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. అయితే.. మేము ప్రధానంగా మెక్రోప్లాస్టిక్‌ను సేకరించటంపైనే దృష్టి సారించాం. ఇది ఒక నమూనా రోబో మాత్రమే. దీనిని పలుమార్లు ఉపయోగించవచ్చు. ' అని తెలిపారు. ఈ బ్లాక్ రోబోట్ చేప కాంతి ద్వారా వికిరణం చెంది.. దాని రెక్కలను తిప్పడం, శరీరాన్ని కదిలిస్తుంది. ఇతర చేపలతో ఢీకొట్టకుండా కాంతి ద్వారా ఆ రోబో చేపను శాస్త్రవేత్తలు నియంత్రించవచ్చు. ఒకవేళ ఏదైనా చేప దానిని మింగేస్తే సులభంగా జీర్ణమయ్యేలా పోలియురెథేన్తో తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. కాలుష్యకారకాలను ఈ చేపలు ఆకర్షిస్తాయి. అలాగే.. ఏదైన ప్రమాదం జరిగినప్పుడు వాటిని అవి పునరుద్ధరించుకుంటాయి. సాధారణ రోబోల కన్నా ఇవి 2.76 రెట్లు వేగంగా ఈదుతాయి కూడా. ఇదీ చూడండి: భూగోళమంతటా ప్లాస్టిక్ భూతం.. సవాళ్లు ఎన్నున్నా.. స్వచ్ఛ సాగరం -
సముద్రాల కాలుష్యం వీటి వల్లే..
జెనీవా: టైర్లు, కృత్రిమ (సింథటిక్) వస్త్రాల నుంచి వెలువడే ప్లాస్టిక్ వ్యర్థాల వల్లే సముద్రాల్లో అధిక భాగం కలుషితం అవుతుందని తాజా నివేదికలో వెల్లడైంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. గృహాలు, పరిశ్రమల నుంచి విడుదలయ్యే మైక్రోప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సముద్రాల్లో 30 శాతం మేర నీరు కలుషితం అవుతుందని పేర్కొంది. ఇది భవిష్యత్‌లో పెను ముప్పుగా మారనుందని హెచ్చరించింది. ప్రతి ఏటా 9.5 మిలియన్ టన్నుల వ్యర్థాలు సముద్రంలోకి విడుదలవుతుండగా, వీటిలో రెండింట మూడొంతులు టైర్లు, కృత్రిమ బట్టల నుంచి వచ్చే వ్యర్థాలే ఉన్నాయని తెలిపింది.