సముద్రాల కాలుష్యం వీటి వల్లే.. | Plastic from tyres 'major source' of ocean pollution | Sakshi
Sakshi News home page

సముద్రాల కాలుష్యం వీటి వల్లే..

Feb 23 2017 12:33 PM | Updated on Mar 22 2019 7:19 PM

టైర్లు, కృత్రిమ (సింథటిక్‌) వస్త్రాల నుంచి వెలువడే ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్లే సముద్రాల్లో అధిక భాగం కలుషితం అవుతుందని తాజా నివేదికలో వెల్లడైంది.

జెనీవా: టైర్లు, కృత్రిమ (సింథటిక్‌) వస్త్రాల నుంచి వెలువడే ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్లే సముద్రాల్లో అధిక భాగం కలుషితం అవుతుందని తాజా నివేదికలో వెల్లడైంది. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. గృహాలు, పరిశ్రమల నుంచి విడుదలయ్యే మైక్రోప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సముద్రాల్లో 30 శాతం మేర నీరు కలుషితం అవుతుందని పేర్కొంది. ఇది భవిష్యత్‌లో పెను ముప్పుగా మారనుందని హెచ్చరించింది.

ప్రతి ఏటా 9.5 మిలియన్‌ టన్నుల వ్యర్థాలు సముద్రంలోకి విడుదలవుతుండగా, వీటిలో రెండింట మూడొంతులు టైర్లు, కృత్రిమ బట్టల నుంచి వచ్చే వ్యర్థాలే ఉన్నాయని తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement