పిల్లలూ... సాయంత్రం కాగానే ఆకాశంలో పక్షులన్నీ గుంపులు గుంపులుగా, రకరకాల ఆకారాలు సృష్టిస్తూ ఎగరడం ఎప్పుడైనా చూశారా? చీకటి పడే ముందు అవి అలా ఎందుకు అల్లరి చేస్తూ ఎగురుతాయో తెలుసా?
మనకు రాత్రి కాగానే ఇళ్లకు వెళ్లాలనిపించినట్లే, వాటికి కూడా ఇంటికి వెళ్లాలని ఉంటుంది. చీకటి పడేలోపు తమ గూళ్లకు చేరుకోవడానికి పక్షులన్నీ ఒకదానిని ఒకటి పిలుచుకుంటూ, గుంపుగా కలిసి ప్రయాణిస్తాయి. అంతేకాదు, ఒంటరిగా ఉంటే డేగలు వేటాడే ప్రమాదం ఉంది. అన్నీ కలిసి ఉంటే శత్రువుల నుండి రక్షణ దొరుకుతుంది. సాయంత్రం వేళ ఇలా దగ్గరగా కూడి ఎగురుతూ ‘ఈరోజు ఎక్కడెక్కడ మంచి తిండి దొరికింది?’ అనే విషయాలను కూడా అవి మాట్లాడుకుంటాయి. రాత్రిపూట చలి పెట్టకుండా అన్నీ కలిసి ఒకే చెట్టుపై వెచ్చగా పడుకోవడానికి పైన ఎగురుతూ ఇలా మీటింగ్ పెట్టుకుంటాయి. సైన్స్ భాషలో దీన్ని ‘మర్మురేషన్’ అంటారు.
Murmuration of starlings.. 😊 https://t.co/Igb2Rjb5N6
— Buitengebieden (@buitengebieden) October 7, 2026
> ఇదీ చదవండి: మందులకు గడువే కాదు..ప్లేస్ కూడా ముఖ్యమే!


