చీరకట్టులో స్కేటింగ్.. కేరళ అందాలకు అద్దం పట్టే వీడియో

Viral Video: Woman Rides Skateboard on Kerala Streets In Sari - Sakshi

తిరువనంతపురంమలయాళీ సంప్రదాయ చీరకట్టుతో ఒక మహిళ కేరళ రోడ్లపై స్కేట్‌ బోర్డింగ్‌ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. వివరాల్లోకి వెళితే... ఆమె పేరు లారిసా. ప్రయాణాలు చేయడం అంటే బోలెడు ఇష్టం. తన ప్రయాణ అనుభవాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. ‘చీరకట్టుకొని స్కేటింగ్‌ చేయడం సులభం కాదు. అయినప్పటికీ సాధించాను. చాలా ఫన్‌గా ఫీలయ్యాను. దారి పొడుగునా జనాలు నాతో సెల్ఫీ దిగడం మరో ఫన్‌’ అంటుంది లారిసా.

ఆమె బ్యాలెన్సింగ్‌ స్కిల్స్‌ గురించి నెటిజనులు ప్రశంసల వర్షం కురిపించారు.‘పచ్చని ప్రకృతిని దర్శిస్తూ కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రోడ్డు మీద స్కేటింగ్‌ చేయండి’ అంటాడు ఒక నెటిజనుడు. మరొకరు ఈ సూచనకు తన సూచన ఇలా జత చేశాడు...‘ఊరకే స్కేటింగ్‌ చేయడం ఎందుకు! ఆ స్కేటింగ్‌కు ఒక పరమార్థం కలిపించాలంటే, పర్యావరణ స్పృహ గురించి ప్రచారం చేస్తూ వెళ్లాలి’ లారీసా స్పందన ఏమిటో వేచిచూద్దాం! 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top