సోదర సోదరీమణులారా.. ఒక లుక్‌ ఇటు వేయరా | video of an adorable baby has garnered over 35 million views on social media | Sakshi
Sakshi News home page

సోదర సోదరీమణులారా.. ఒక లుక్‌ ఇటు వేయరా

Mar 17 2024 6:04 AM | Updated on Mar 17 2024 6:04 AM

video of an adorable baby has garnered over 35 million views on social media - Sakshi

వైరల్‌

ఒక వీడియా 35 మిలియన్‌ల వ్యూస్‌తో వైరల్‌ కావడానికి ఎన్ని విన్యాసాలు చేయాలి?
‘అబ్బే! అంతక్కర్లేదండి’ అని చెప్పడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో 35 మిలియన్‌ల వ్యూస్‌తో వైరల్‌ అయిన ఈ చిన్న వీడియోనే సాక్ష్యం.

కీస్‌ అనే మహిళ కెమెరా లెన్స్‌ ముందు పసిబిడ్డను పడుకోబెట్టి ‘కెన్‌ యూ ప్లీజ్‌ వాచ్‌ మై బేబీ ఫర్‌ మీ’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. పసిబిడ్డ అసా«ధారణ విన్యాసాలేమీ చేయలేదు. కెమెరాను అలా చూస్తూ ఉన్నాడంతే. పసిబిడ్డ తేనెకళ్లు, చివర్లో నవ్విన నిష్కల్మషమైన నవ్వు లక్షలాది మంది ప్రేక్షకులను  కదిలించింది. ప్రపంచంలో ఎన్ని భాషలు అయినా ఉండొచ్చు. అయితే శిశువుది మాత్రం విశ్వభాష. అది అందరికీ అర్థమవుతుంది. అందరికీ తెగ నచ్చుతుంది అని చెప్పడానికి, పవర్‌ ఆఫ్‌ సింప్లిసిటీకి అద్దం పట్టే ఈ వీడియోనే నిదర్శనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement