నా లోగో నా ఇష్టం | Sakshi
Sakshi News home page

నా లోగో నా ఇష్టం

Published Sun, Jul 30 2023 6:01 AM

Twitter flooded with hilarious memes after Elon Musk changed its logo to X - Sakshi

‘నా లోగో నా ఇష్టం’ అని ఎలాన్‌ మస్క్‌ అనుకున్నా సరే, నెటిజనులు మాత్రం రకరకాల మీమ్స్‌తో ట్విట్టర్‌ కొత్త లోగోను ఆటపట్టిస్తున్నారు. ‘అడల్ట్‌ ఫిల్మ్‌ సైట్‌ లోగోలా ఉంది’
‘ట్విట్టర్‌ ఎక్స్‌–లవర్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెప్పేలా ఉంది ఈ లోగో’... ఇలాంటి కామెంట్స్‌ సంగతి ఎలా ఉన్నా, సోషల్‌ మీడియాలో రకరకాల మీమ్స్‌ సందడి చేస్తున్నాయి. ప్రాంతీయ భాష
 చిత్రాల నుంచి హాలీవుడ్‌ సినిమాలలోని సీన్‌ల వరకు ఈ మీమ్స్‌ వైరల్‌ అయ్యాయి.

ఒక సృజనకారుడు పాత ట్విట్టర్‌ లోగో పిట్ట, కొత్త లోగో ‘ఎక్స్‌’ను మిక్స్‌ చేసి సరికొత్త లోగోను సృష్టించాడు.  ఈ లోగోను మస్క్‌గానీ చూశాడంటే పుసుక్కున ‘ఇదే నా కొత్త లోగో’ అని ఎనౌన్స్‌ చేయడం ఖాయం! రైలు చివరి బోగీపై పెద్ద సైజులో ‘ఎక్స్‌’ అనే గుర్తు ఉంటుందనేది తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకాయన రైల్వే డిపార్ట్‌మెంట్‌కు ఇలా విన్నవించుకున్నాడు...
‘మీ గుర్తును వాళ్లు లాగేసుకున్నారు. కాబట్టి బోగీ చివర ‘ఎక్స్‌’ స్థానంలో ట్విట్టర్‌ పాత లోగో పిట్ట ఉండాల్సిందిగా నా విజ్ఞప్తి’.

Advertisement
 
Advertisement
 
Advertisement