కొరియన్‌ బ్యూటీ బ్రాండ్స్‌ వ్యవస్థాపకురాలిగా సత్తా చాటుతున్న టీచర్‌! | Sakshi
Sakshi News home page

కొరియన్‌ బ్యూటీ బ్రాండ్స్‌ వ్యవస్థాపకురాలిగా సత్తా చాటుతున్న టీచర్‌!

Published Mon, Mar 25 2024 2:06 PM

Toinali Chophi Is The Founder Of Indias Leading Korean Skincare Brands - Sakshi

కొరియన్‌ బ్యూటీ ప్రొడక్ట్‌లకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా ఆ ప్రొడక్ట్‌లన్నీ సహజసిద్ధమైన వాటితోనే తయారు చేయడంతో ఆ ప్రొడక్ట్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కూడా ఉంది. అందులోనూ కొరియన్‌ మహిళలు మచ్చలేని చందమామలా కనిపించడంతో ఆ దేశ ప్రొడక్ట్‌లను కొనేందుకు ప్రజలు ఎగబడుతుంటారు. ముఖ్యంగా వాళ్ల గ్లాస్‌ స్కిన్‌ మరింతగా కట్టిపడేస్తుంది. అలాంటి ప్రముఖ కొరియన్‌ బ్రాండ్‌లలో ఒక ప్రసిద్ధ బ్రాండ్‌ని ప్రారంభించి.. ఓ టీచర్‌ సత్తా చాటుంది. వ్యాపారవేత్తగా విజయపథంలో దూసుకుపోతోంది. ఆమె సక్సెస్‌ జర్నీ ఎలా ప్రారంభమయ్యిందంటే..

చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో కొరియన్‌ బ్రాండ్‌లదే అగ్రస్థానం అని చెప్పాలి. కొరియన్ల మచ్చలేని చర్మం కారణంగానే ఆ ప్రొడక్టలకు ఇంత ప్రజాధరణ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కొరియన్‌ డ్రామాలు, సినిమాలకు భారత్‌ అంతటా వేలాదిగా అభిమానులు ఉన్నారు. బహుశా ఆ కారణం వల్ల కూడా ఈ  కొరియన్‌ బ్యూటీ ప్రొడక్టలకీ మార్కెట్‌లో ఇంతలా డిమాండ్‌ ఉంది. అయితే ఈ కొరియన్‌ ప్రొడక్టలకీ కేవలం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్‌ ఉంది. అలాంటి కొరియన్‌ బ్యూటీ ప్రొడక్టలలో ప్రసిద్ధ బ్రాండ్‌ అయినా బ్యూటీ బార్న్‌ వ్యవస్థాపకురాలు నాగలాండ్‌కి చెందిన తోయినాలి చోఫీ .

ఈ కే బ్యూటీ బ్రాండ్‌ని చోఫీ 2016లో స్థాపించింది. ఇందులో బార్న్ COSRX నత్త మ్యూసిన్, క్లైర్స్ జ్యూస్డ్ విటమిన్ డ్రాప్, హోలికా సిరమైడ్ క్రీమ్‌ తదితర ఫేమస్‌ బ్యూటీ ప్రొడక్ట్‌లను తయారు చేస్తారు. ప్రారంభంలో కేవలం 500 ఆర్డర్లు మాత్రమే వచ్చినట్లు చోఫీ పేర్కొంది. అయితే కాల క్రమేణ ఉత్పత్తుల నాణ్యత కారణంగా ఆ సంఖ్య విపరీతంగా పెరిగి, భారత్‌లో ఉన్న మిగతా ప్రసిద్ద కొరియన్‌ బ్రాండ్‌లలో ఇది కూడా ఒకటిగా దూసుకుపోవడం ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇక చోఫీ ఈ వ్యాపారం గురించి మాట్లాడుతూ ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు బాగానే ఉన్నాయని చెప్పారు.  అయితే ఈ బ్రాండ్‌ని తాను కేవలం నాగాలండ్‌కే పరిమితం చేయాలనుకోవడం లేదని, భారతదేశమంతటా విస్తరించనున్నట్లు తెలిపింది.

ఇక తాను టీనేజ్‌లో ఉన్నప్పుడూ ముఖంపై వచ్చిన మొటిమలు, మచ్చలతో ఇబ్బంది పడుతుండేదాన్ని అని చెప్పారు. అప్పుడే తన స్నేహితులు ఈ కొరియన్‌ చర్మసంరక్షణ ప్రొడక్ట్‌లు బెటర్‌ అని సూచించడంతో తనకు వాటి గురించి తెలిసిందని చెప్పుకొచ్చింది. అవి తనకు బాగా పనిచేయడంతోనే ఈ బ్యూటీ ప్రొడక్టలను తయారు చేసే వ్యాపారం చేయాలని అనుకున్నట్లు తెలిపారు. ఆ ఆసక్తి కారణంగానే టీచర్‌ ఉద్యోగాన్ని వదిలి మరీ ఈ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టానని చెప్పుకొచ్చింది. ఇక ఆమె బ్రాండ్‌కి చెందిన అధికారిక ఇన్‌స్టాగ్రాంలో 45 వేల మందికి పైగా ఫాలోవర్లు, అభిమానులు ఉండటం విశేషం. ఆసక్తి ఉంటే టీ

(చదవండి: డౌన్‌ సిండ్రోమ్‌తో డౌన్‌ అయిపోలే..! ఏకంగా మోడల్‌గా..!)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement