ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం..ధర ఏకంగా రూ. 65 లక్షలు పైనే..

Stag Beetle: Worlds Most Expensive Insect Worth Around Rs 65 Lakh - Sakshi

ఈ ప్రపంచంలో ఎన్నో జంతువులు, కీటకాలు ఉంటాయి. అందులో కొన్నింటిని మనం ఆహారంగా తీసుకుంటాం. కొన్ని మన ప్రాణాలకు ప్రమాదకరం. అయితే ఒక కీటకం ధర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలవడం విశేషం. దీని ధర ముందు బీఎండబ్ల్యూ, ఆడీ కార్లకు కూడా బలదూర్‌ అనిపించేలా ఉంది. అయినా ఒక కీటకం ఎందుకు అంత ధర పలుకుతుంది? దాని వల్ల ఉపయోగం ఏంటీ..? అంటే..

స్టాగ్ బీటిల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం. ఇది కేవలం 2 నుంచి 3 అంగుళాల సైజులో ఉంటుంది. చెత్తలో ఉండే ఈ కీటకాన్ని జపనీస్‌ పెంపకందారుడు ఏకంగా 65 లక్షలుకు విక్రయించాడు. ఇప్పుడు అది ఏకంగా కోటి పైనే పలుకుతోందట. ప్రజలు కూడా ఈ అరుదైన కీటకాన్ని కొనుగోలు చేయడానికి కోట్లు వెచ్చిస్తుండటం విశేషం. స్టాగ్ బీటిల్స్ లుకానిడే కుటుంబానికి చెందినవి, ఇందులో దాదాపు 1,200 రకాల కీటకాలు ఉన్నాయి. ఈ భూమిపై ఉన్న అత్యంత వింతైన చిన్న కీటకం ఇది. చూడటానికి నల్లగా ఉండి తల నుంచి పొడుచుకు వచ్చిన కొమ్ముల ఉంటాయి.

చెత్తలో ఉండే స్టాగ్ బీటిల్స్ కుళ్లిన కలపలోన ద్రవాలు, పండ్లరసం, చెట్ల రసం వంటి వాటినే  ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఎక్కువగా ద్రవాల మీద ఆధారపడతాయి. ఎందుకంటే ఇవి తినలేవు. ఈ కీటకం సుమారు 7 సంవత్సరాలు జీవిస్తుందట. అయితే ఇది స్టాగ్ బీటిల్ అని వాటి తలపై ఉన్న కొమ్ముల ఆధారంగా గుర్తిస్తారట. అయితే వీటిని వివిధ రకాల మందుల తయారీలో వినియోగిస్తారు. అందువల్లే ఇది అంత ఖరీదు. వీటిలో మగ స్టాగ్‌ బీటిల్స్‌ పెద్ద దవడలు కలిగి ఉండగా, ఆడవారి దవడలు, మగవారి కంటే బలంగా ఉంటాయి.

ఇక ఆడ స్టాగ్ బీటిల్స్ తరచుగా నేలపైనే కనిపిస్తాయి. ఎందుకంటే..? గుడ్డు పెట్టేందుకు ఎల్లప్పుడూ నేలపై సంచరిస్తుంటాయి. అయితే ఈ కీటకాలు పెద్దవి అయిపోయాక గట్టి చెక్కను తినలేవట. దాంతో లార్వా కాలంలో ఏర్పడిన కొవ్వు నిల్వలపై ఆధారపడతాయి. శీతల వాతావరణం స్టాగ్ బీటిల్స్‌కు తగినది కాదు, ఎందుకంటే..? ఇది లార్వా ప్రక్రియను పొడిగించగలదు. శీతాకాలంలో చాలా కీటకాలు చనిపోతాయి, కాబట్టి వెచ్చని ప్రదేశాలు వాటికి ఉత్తమమైనవి. దీన్ని ఎక్కువగా ప్రమాదకరమైన వ్యాధులకు మందులు తయారు చేయడంలో ఉపయోగిస్తారట. అందువల్లే బీఎండబ్ల్యూ, ఆడీ కార్లను తలదన్నేలా అత్యంత ధర పలుకుతోంది. అయితే ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉండటం బాధకరం. 

(చదవండి: చాక్లెట్‌, కెల్లాగ్స్‌ చాకోస్‌లో పురుగుల కలకలం! అలాంటివి వెంటనే తిరిగిచ్చేసి ఉచితంగా మరొకటి..)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top