స్వీట్‌ ట్యూన్‌ ట్విన్‌ సిస్టర్స్‌! | Singing Duo Sisters Sukriti And Prakriti Kakar | Sakshi
Sakshi News home page

స్వీట్‌ ట్యూన్‌ ట్విన్‌ సిస్టర్స్‌!

Dec 1 2023 10:19 AM | Updated on Dec 1 2023 10:19 AM

Singing Duo Sisters Sukriti And Prakriti Kakar - Sakshi

ట్విన్‌ సిస్టర్స్‌ సుకృతి, ప్రకృతి కకర్‌లకు సంగీతం బాల్యం నుంచి సుపరిచితం. తల్లి మ్యూజిక్‌ టీచర్‌. అక్క  ప్రొఫెషనల్‌ సింగర్‌. ఎనిమిది సంవత్సరాల వయసులో సంగీత ప్రపంచంలో తొలి అడుగులు వేశారు. పాపులర్‌ హిట్స్‌తో సింగర్స్‌గా బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. అక్క సుకృతి సంగీతంలో తమకు స్ఫూర్తి అని చెబుతారు. అలా అని అక్కను అనుకరించకుండా తమదైన ముద్ర కోసం ప్రయత్నించి విజయం సాధించారు ప్రకృతి.

‘మొదట్లో ప్రశంసలను మాత్రమే ఆస్వాదించే వాళ్లం. విమర్శలను దూరంగా పెట్టేవాళ్లం. అయితే సంగీత పరిశ్రమలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా సహజం అనే వాస్తవం తెలుసుకున్నాను. నిర్మాణాత్మక విమర్శలు ముఖ్యం. ద్వేషపూరిత విమర్శలతో ట్రోలింగ్‌ చేయడం తగదు’ అంటుంది ప్రకృతి. వంద వరకు లైవ్‌ షోలు చేసిన ఈ సిస్టర్స్‌ ‘ప్రతి షో ఒక పాఠం నేర్పుతుంది’ అంటారు.

‘ప్రపంచవ్యాప్తంగా మ్యూజిషియన్‌లు లైవ్‌ షోలకు ప్రాధాన్యత ఇస్తారు. మేము కూడా అంతే. ఆన్‌లైన్‌లో కంటే ప్రేక్షకుల సమక్షంలో వారి  ప్రతిస్పందనలు, ప్రశంసలు, చప్పట్లు ఆస్వాదిస్తూ లైవ్‌ షో చేయడంలో ఎంతో మజా ఉంటుంది. ఇక ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌ మాలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుంది. యువ సంగీతకారులు తమను నిరూపించుకోవడానికి ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌ సహాయపడుతుంది’ అంటుంది సుకృతి.

(చదవండి: చీకటిమయంగా ఉన్న కూతురి జీవితాన్ని 'ప్రేరణ ' ఇచ్చే శక్తిగా మార్చిన ఓ తల్లి కథ!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement