వెర్సాస్‌​ గౌనులో యువరాణిలా శ్లోకా మెహతా..! | Shloka Mehta In Gorgeous Gown At Anant Radhika Pre Wedding, Pics Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

వెర్సాస్‌​ గౌనులో యువరాణిలా శ్లోకా మెహతా లుక్‌ అదుర్స్‌..!

Published Tue, Jun 18 2024 1:00 PM | Last Updated on Tue, Jun 18 2024 1:28 PM

Shloka Mehta In Gorgeous Gown At Anant Radhika Pree Wedding

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ ​అంబానీ పెళ్లి వేడుకలు ఓ రేంజ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులోనూ ఇంటిలో జరిగే ఆఖరి వివాహం కావడంతో మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల లగ్జరీ క్రూయిజ్‌లో ఏకంగా 800ల మంది అతిథుల సమక్షంలో అనంత్‌-రాధికల రెండో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సంబంధించిన అంబానీ కుటుంబ సభ్యుల వేషాధారణకు సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటిగా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఈ వేడుకల్లో వధువు ధరించిన ప్రతి డ్రెస్‌ హైలెట్‌గా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా రాధిక ధరించిన అనంత్‌ లవ్‌ లెటర్‌ని ముద్రించిన గౌను అత్యంత హాట్‌టాపిక్‌గా మారింది. ఇక ఈ వేడుకలో ముఖేష్‌ అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా సైతం ప్రిన్స్‌ రేంజ్‌లో తన వేషాధారణతో ఆకట్టుకుంది. ఈ వేడుకలో రాధికాకు ఏ మాత్రం తగ్గకుండా ఆమె ఆహార్యం ఉంది. ముఖ్యంగా ఆమె ఈ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో ధరించిన డ్రెస్‌లు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో ఆమె నీలం- బంగారు డ్రెస్‌లో యువరాణిలో మెరిసింది శ్లోకా మెహతా. 

ఆమె ఈ వేడుకలో కోసం ధరించిన వెర్సాస్‌ బ్రాండ్‌ గౌనుని ఎంచుకుంది. ఈ గౌను 2018 మెట్‌ గాలో జిగి హడిద్‌ ఫ్యాషన్‌ శైలిని అనుకరించింది. ఈ గైనును రూపొందించింది స్టైలిస్ట్‌ దియా మెహతా జటియా. ఆమె ఈ వెర్సాస్‌ గౌను శ్లోకా మెహతా కోసం ఎందుకు రూపొందించారో వెల్లడించింది. శ్లోకా మెహతా ఇద్దరు పిల్లల తల్లి. మాతృత్వం రీత్యా శరీరాకృతి మారడం సహజం. అది బయటకు కనిపించకుండా ఉండేలా ఆమెలో ఉ‍న్న యువరాణి లుక్‌ని వెలికి తీసేలా ప్రజెంట్‌ చేసేందుకు ఈ వెర్సాస్‌ గౌనుని రూపొందించామని చెప్పారు. మెట్‌ గాలాలో ఆకర్షణగా కనిపించిన జిగి హడిడ్‌ రూపాన్ని మెహాతాలో కొట్టొచ్చినట్లు కనిపించేలా చేసేందుకు ఇలా నీలం బంగారు గౌనుని డిజైన్‌ చేశామని అన్నారు. శ్లోకా ఈ గౌనుకి తగ్గట్టుగా రోజీ మేకప్‌, డైమండ్‌ జ్యువెలరీని ధరించింది. ఈ గౌనులో శ్లోకా యువరాణి రేంజ్‌ స్టన్నింగ్‌ లుక్‌తో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.  

(చదవండి: ఒత్తిడికి గరైనప్పుడు జంక్‌ ఫుడ్‌ తినడకూడదా? పరిశోధన ఏం చెబుతోందంటే..)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement