జీసస్‌ ఎలా కనిపించేవారంటే..?! పరిశోధనలో షాకింగ్‌ విషయాలు | Sakshi
Sakshi News home page

జీసస్‌ రియల్‌ లుక్‌ ఎలా ఉండేదంటే..? పరిశోధనలో షాకింగ్‌ విషయాలు

Published Mon, Dec 25 2023 12:48 PM

Scientists Said Origninal Face Of Jesus Christ Using Ancient Skulls - Sakshi

జీసస్‌ లేదా ఏసుక్రీస్తూ ఎలా ఉంటారో మనకు తెలిసిందే. మనం చూసిన కొన్ని ఫోటోలు, టీవీల్లోనూ  పొడవాటి జుట్టుతో పై నుంచి కింద వరకు ఓ గౌను మాదిరి తెల్లటి లేదా నీలం డ్రస్‌ వేసుకుని, గడ్డంతోనే చూశాం. ఆయన చేతి వేళ్లు బాగా పొడుగ్గా ఉన్నట్లు చిత్రాల్లో చూపించేవారు. పాశ్చాత్య చిత్రాల్లో కూడా మనం అలానే చూశాం. అయితే నిజానికి ఆయన ఎలా ఉండేవారు? ఆయన ముఖ చిత్రం ఎలా ఉండేది అనేదానిపై చాలా మందికి పలు సందేహాలు ఉన్నాయి. ఆయను రియల్‌ లుక్‌ ఎలా ఉండేది అనే దానిపై జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు చాలా షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. 

వివరాల్లోకెళ్తే..ఏసుక్రీస్తు నిజంగా మనం చూసిన చిత్రాల్లో ఉన్నట్లే ఉంటారా? లేక ఎలా ఉండేవారనేది పలు శాస్త్రవేత్తల మదిని తొలిచే చిక్కు ప్రశ్న. ఆ దిశగా జరిపిన పరిశోధనలో..కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసిద్ధి పొందిన తొలి ఏసు క్రీస్తు చిత్రం గ్రీకు సామ్రాజ్యం నుంచి వచ్చింది. ఆ తర్వాత నాల్గో శతాబ్దం నుంచి బైజాంటైన్ యుగపు మెస్సీయ వర్ణనతో కూడిని చిత్రాలు మనస్సుల్లో బాగా నిలిచిపోయాయి. దాన్ని బట్టి క్రీస్తూ ఇలా ఉండేవారనేది ఓ ఊహ మాత్రమే కానీ వాటిల్లో కచ్చితత్వం లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

నిజానికి ఆయన చిత్రాలు సింహాసనంపై ఒక చక్రవర్తిలా కూర్చున్న ఏసు చిత్రం ఆధారంగా వచ్చినవే. ఈ ఏసు చిత్రం రోమ్‌లో శాంటా ప్యూడెన్‌జైనా చర్చిలోని మొజాయిక్‌లో కనిపిస్తుంది. అందులో పొడవాటి జుట్టు, గడ్డంతో సింహాసనంపై కూర్చొన్న ఆయన జూస్‌ మాదిరిగా కనిపిస్తారు. జూస్ అంటే ప్రాచీన గ్రీకు మతంలో ప్రధాన దేవుడు. ఒలింపియా ఆయన దేవాలయం. అందులోని ఆయన విగ్రహం ఆధారంగానే ఏసుక్రీస్తు చిత్రాలు వచ్చాయని అన్నారు పరిశోధకులు. బైజాంటియన్ కళాకారులు ఏసుక్రీస్తును స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించారు. వారు ఆయన్ను యువ జూస్‌ రూపంలో చూపించేవారు.

కానీ, కాలక్రమేణా స్వర్గానికి చెందిన ఏసుక్రీస్తు చిత్రాల విజువలైజేషన్‌లో మార్పులు వచ్చాయి. అయినప్పటికీ ఏసు క్రీస్తూ ఎలా ఉంటారనేది అనే ప్రశ్న ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉండేది శాస్త్రవేత్తలను. ఈ నేపథ్యంలోనే ఏసు తల నుంచి పాదాల వరకు ఆయన రూపం ఎలా ఉంటుందనే దానిపై కూలకషంగా పరిశోధనలు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు రిచర్డ్‌ నీవ్‌ నేతృత్వంలోని బ్రిటీష్‌ ఫోరెన్సిక్‌ ఆంత్రోపాలజిస్టుల బృందం ఇజ్రాయెల్‌ పురావస్తు ప్రదేశాల్లోని పుర్రెలను పరిశీలించడం, బైబిల్‌ గ్రంధాలు, చారిత్రక ఆధారాలను విశ్లేషించడం తదితర పనులు చేశారు. వారంతా ఏసు ఎలా కనిపించేవాడో అనే దిశగా అతని ప్రసిద్ధ ముఖ చిత్రాన్ని పునర్‌నిర్మించాలానే దిశగా శోధించడం ప్రారంభించారు.

ప్రముఖ ప్రాంతాల్లో లభించిన కొన్ని రకాల పుర్రెల ఆధారంగా రూపొందించే దిశగా అడుగులు వేశారు. ఆ పరిశోధనల్లో..అతను ఒకటవ శతాబ్దపు  యూదు మనిషిలాగా ఉండేవారని, ముదురు రంగు చర్మంతో , పొట్టి పొట్టి గిరజాల జుట్లుతో ఉండేవారని కనుగొన్నారు. నిపుణల అభిప్రాయం ప్రకారం ఆయన రూపం మనం చూసే చిత్ర రూపానికి దగ్గరగానే ఉంటుందని అన్నారు. అతని ఆ కాలంలోనే పురుషుల కంటే విభిన్నంగా కనిపించేవాడని కూడా చెప్పుకొచ్చారు. ఓ విశేషమైన వ్యక్తిత్వం కలవాడిగా సుస్పష్టంగా అనిపించేదాన్ని అందువల్లే కొందరూ ఆయన్ని దేవుని కుమారుడిగా కీర్తించి ఉండవచ్చని అన్నారు.

ఆ ఫోరెన్సిక్‌ బృందం రూపొందించిన ముఖం చేస్తే ఏసు ముఖం ఇలా ఉండేదా..? అనిపిస్తుంది. ఇది మనం చూసే ఏసు ముఖానికి కాస్త విభిన్నంగా ఉంది. కానీ ఏసుని స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించే చిత్రాలను రూపొందించడంతో ఆయన అలా ఉంటారనే అనుకున్నాం. ఎందుకంటే బైబిల్‌ని విశ్లేషిస్తే ప్రజలు మొదట్లో ఆయన్ని దేవుడిగా భావించలేదు ఓ సాధారణ మనిషిలానే భావించేవారు. అప్పుడు ఆయనకు గడ్డం గానీ పొడవాటి జుట్టు కానీ లేదు. గ్రీకు-రోమన్ కాలంలో శుభ్రంగా గడ్డం చేసుకోవడం, జుట్టు పొట్టిగా ఉండడం తప్పనిసరిగా భావించేవారు. మెడ వరకూ ఉన్న జుట్టు, గడ్డం దైవత్వాన్ని సూచిస్తుంది. అప్పటి పురుషులకు అలాంటి రూపం ఉండేది కాదు.

తత్వవేత్తలు కూడా చాలా పొట్టి జుట్టుతోనే ఉండేవారు. చెదిరిన జుట్టు, గడ్డం వేదాంతులకు చిహ్నంగా భావించి ఉండవచ్చు. అందువల్ల ఏసు క్రీస్తూ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని అంటున్నారు. కానీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆయన ఓ విశిష్టమైన వ్యక్తిలా అందర్నీ అబ్బురపరిచేలా ఉండేవారని, దీంతో మొదట్లో సాధారణ మనిషిలా చూసిన వారు ఆయన మంచి వ్యక్తిత్తత్వానికి దాసోహం అయ్యి దేవుడిలా భావించడం జరిగింది. అదీగాక స్వాభావికంగా మంచి పనుల చేసే వ్యక్తులను దేవత్వం కలిగినా లేదా దేవడిచ్చిన వ్యక్తులుగా భావించడం జరుగుతుంది. దీనివల్ల కూడా ఆయన ముఖ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని జీసస్: ది కంప్లీట్ స్టోరీ పేరుతో చేసిన పరిశోధన డాక్యుమెంటరీలో వెల్లడించింది ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్తల బృందం. 

(చదవండి: పండుగ వేళ నిరసనల హోరు..వెలవెలబోయిన ఐకానిక్‌ క్రిస్మస్‌ ట్రీ)

Advertisement
 
Advertisement