అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు కదూ.. నిజం తెలిస్తే, ఆశ్చర్యపోతారు

Safety Face Shield Full Face Protection Face Mask And Safety Goggles - Sakshi

 ఫేస్‌ గాగూల్స్‌

ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తులను చూస్తుంటే.. ఎవరో అనుమానాస్పదుల్లా కనిపిస్తున్నారు కదూ? ఎందుకు వారు ముఖాన్ని దాచుకుంటున్నారు? ఏదైనా ల్యాబ్‌లో పనిచేస్తూ .. మరిచిపోయి డైరెక్ట్‌గా రోడ్డు మీదకు వచ్చేశారా? లేదా.. మనుషులను పోలి ఉండే గ్రహంతర వాసులా? ఇలాంటి వింత ఆలోచనలు అనుమానాలన్నీ మీ బుర్రను తొలిచేయడం మొదలుపెట్టే ఉంటాయి.

(చదవండి: పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, ఊరంతా బలాదూర్‌ తిరగడం.. ఈ కుక్క ప్రత్యేకత)

అసలు నిజం తెలిస్తే, ఆశ్చర్యపోతారు. మాస్కును మించి ముఖాన్ని కవర్‌ చేసేసేలా వీరు ధరించినవి కొత్తరకం గాగుల్స్‌. నిజం.. ఇవి సరికొత్త కళ్లజోళ్లు. సాధారణంగా ఎండ నుంచి కళ్లను రక్షించే సన్‌గ్లాసెన్‌ను మాత్రమే ఇప్పటివరకు చూసి ఉంటారు. కానీ, ఈ సన్‌గ్లాసెస్‌ మాత్రం మీ ముఖం మొత్తాన్ని ఎండ ప్రభావం నుంచి కాపాడుతాయి. జపాన్‌కు చెందిన ఓ కంపెనీ అధిక నాణ్యత గల పాలికార్బొనేట్‌తో వీటిని రూపొందించింది.

సాధారణ సన్‌ గ్లాసెస్‌లాగే వీటిని కూడా చెవుల పైభాగం నుంచి ధరించొచ్చు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ గాగుల్స్‌ ఎండ నుంచే కాదు, కరోనా వంటి మహమ్మారి రోగాల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరైనా వీటిని ధరించొచ్చు. ఆన్‌లైన్‌ మార్కెట్‌లో వివిధ పరిమాణాలు, ధరల్లో ఇవి లభిస్తున్నాయి.

(చదవండి: కరోనా ఆంక్షలు.. బెస్ట్‌ ఫ్రెండ్‌ పెళ్లి.. అప్పుడొచ్చింది ఓ మైండ్‌ బ్లోయింగ్‌ ఐడియా!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top