ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్‌ న్యూస్‌ చెప్పిన లవ్‌బర్డ్స్‌ | Richa Chadha and Ali Fazal Reveals Their Little Baby Is On The Way, Announces First Pregnancy - Sakshi
Sakshi News home page

Richa Chadha Announces Pregnancy: ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్‌ న్యూస్‌ చెప్పిన లవ్‌బర్డ్స్‌

Published Fri, Feb 9 2024 4:35 PM

Richa Chadha and Ali Fazal Announces thier Little Baby Is On The Way - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ జంట రిచా చద్దా, అలీ ఫజల్‌ తన అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామంటూ సోషల్‌  మీడియా ద్వారా ప్రకటించింది.  ఈ సందర్బంగా ఒక ఇంట్రస్టింగ్‌ ఫోటోను షేర్‌ చేసింది రిచా. "1 + 1= 3" అంటూ  శుక్రవారం  ఇన్‌స్టాలో వెల్లడించింది.

రిచా పోస్ట్‌కు భర్త అలీ ఫజల్‌ స్పందిస్తూ ‘ఆ చిన్న గుండె సడి తమకు ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప సవ్వడి’ అంటూ  కామెంట్‌ పెట్టాడు.  దీంతో సన్నిహితులు, అభిమానులు  ఈ జంటకు విషెస్‌ అందిస్తున్నారు. 

కాగా  2012లో ఫక్రే సెట్స్‌లో వీరిద్దరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఏడేళ్ల డేటింగ్ తర్వాత అలీ 2019లో రిచా చద్దాకు ప్రపోజ్ చేశాడు.  కరోనావైరస్ మహమ్మారి కారణంగా 2020లో తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు.  రెండేళ్ల తరువాత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో 2022 అక్టోబర్ 6 న ప్రీ వెడ్డింగ్ వేడుకలతోపాటు ఘనంగా పెళ్లి చేసుకున్నారు. దాదాపు రెండేళ్ల తరువాత ఈ జంట తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతోంది. 

Advertisement
 
Advertisement